మంచి భార్యకి ఉండాల్సిన లక్షణాలు గురించి పురాణాల్లో చెప్పారు కానీ.. మంచి భర్తకు ఉండాల్సిన లక్షణాలు గురించి ఏ పురాణంలోనూ చెప్పలేదు. కానీ మంచి భర్త అవ్వాలంటే ఈ లక్షణాలు మీలో లేకుండా చూసుకోండి అంటున్నారు రిలేషన్షిప్ ఎక్స్ పర్ట్స్ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దాంపత్య జీవితంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు సాగుతేనే వారి జీవితం ఏ కలహాలు లేకుండా సాఫీగా సాగుతుంది.
ఒకరి కోసం మరొకరు అని అనుకుని ఉంటేనే వారి జీవితం కడ వరకు నిలబడుతుంది. ఒక మంచి భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండకూడదు ఇప్పుడు చూద్దాం. ఒక భార్య తన భర్త దగ్గర నుంచి నిజాయితీని, గౌరవం ని కోరుకుంటుంది. నిజంగా మీరు ఒక మంచి భర్త అనిపించుకోవాలంటే మీ భార్యతో నిజాలు చెప్పి ఆమెకి గౌరవం ఇవ్వాలి. నిజాయితీ లేని భర్తను ఏ స్త్రీ ఒప్పుకోదు. అలాగే భర్తలో మెచ్యూరిటీ మెంటాలిటీ లేకపోతే ఆ సంసారం కష్టాల్లో పడుతుంది.
ఒక మంచి భర్తకి ఫ్యూచర్ ప్లానింగ్ చాలా అవసరం ఎందుకంటే తన భార్యకి భవిష్యత్తులో భద్రత కల్పించ వలసిన బాధ్యత భర్తకు ఉంది. ఇక వీటన్నిటికీ ముఖ్యమైనది తన భార్యకు ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉండడం. ఒక స్త్రీ తన భర్త అవసరం ఉన్నప్పుడు స్త్రీకి సపోర్ట్ చేయకపోతే ఆ భర్త ఎప్పటికీ ఉత్తముడు కాలేడు. ఈ లక్షణాలు మీ భర్తలో ఉన్నట్లయితే మీ భర్త ఎల్లప్పుడూ మీ చేయి విడిచిపెట్టడు.