బాలీవుడ్ సీనియర్ యాక్టర్ నీనాగుప్త ఇటీవల మోడ్రన్‌వేర్‌లో కనిపించే అందర్నీ ఆశ్చర్యపరిచింది. చిన్నపిల్లల దుస్తులు వేసుకుని రోడ్డుపై దర్శనం ఇచ్చినందుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్స్‌ని ఎదుర్కొంటుంది. ఇటీవల ఓ పార్టీకి హాజరైన నీనా గుప్తా లుక్ చాలా కొత్తగా అనిపించింది. బ్లాక్ కలర్ టాప్, ఎత్తైన బూట్లు, మ్యాచింగ్ గ్లాసెస్, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఆ పార్టీకి వచ్చింది.
అంతే కాదు ఈ వేషధారణలో నీనా కెమెరాలకు ఫోజులు ఇవ్వడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో వయసు గురించి పట్టించుకోకుండా సింపుల్ మేకప్ బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ స్టైల్ అందమైన చెవిపోగులతో ఆనందంగా ఉందని నైస్ ఔట్ఫిట్ అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు.
కొంతమంది హేట్టేర్స్ మాత్రం చాలా అన్ కంఫర్టబుల్‌గా కనిపిస్తుంది. అలాంటప్పుడు అలా దుస్తులు అవసరమా.. అమ్మాయిలు చీరలో అందంగా కనిపిస్తారు, ఈ వయసులో కూడా నీకేం పోయేకాలం? 70 ఏళ్ళు వచ్చిన ఇంకా మోడరన్ గా రెడీ అవ్వాలనే కోరికలోనే బ్రతుకుతున్నావ్, వృద్ధాప్యంలో యవ్వనంగా కనిపించాలని అంత ఆశ ఎందుకు..? అంటూ బండబూతులతో ట్రోల్లింగ్ చేస్తున్నారు.