భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏవిధంగా ఉంటుందో చెప్పవచ్చు. అలాంటిది క్రికెట్ ప్రియులు దాయాదులతో భారత్ ప్రపంచ కప్ మ్యాచ్ అంటే అంచనాలు పిక్ స్టేజ్ లో ఉంటాయి. మెగాటోర్నిలో దాయాదుల మ్యాచుని లైవ్‌లో చూసేందుకు ఫ్యాన్స్ ఇప్పటికే ఆరాటంలో తేలుతున్నారు. కాగా మ్యాచ్ ముందు రోజు అక్కడ హోటల్స్ కు డిమాండ్ పెరిగిపోవడంతో చాలామంది క్రికెట్ అభిమానులు ఇప్పటినుంచి బస చేయడానికి హోటల్ గదులను బుక్ చేసుకుంటున్నారు. మ్యాచ్‌కి ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని హోటల్స్ నిర్వాహకులు రూమ్స్ రేట్లను ఒకసారిగా పెంచేశారు.
హోటల్‌కి ఒక రోజు బస చేసేందుకు అభిమానులు మినిమం రూ.లక్ష వరకు పే చేయాల్సి వస్తుంది. మ్యాచ్ నేపథ్యంలో చాలావరకు హోటల్ అడ్వాన్స్ బుకింగ్లు దాదాపు ఫుల్ అయినట్లు తెలుస్తుంది. మ్యాచ్ కారణంగా అహ్మదాబాద్ హోటల్స్ రేట్లు భరించలేని చాలామంది కొత్త ప్లాన్ వేస్తున్నారు. ఎలాగైనా మ్యాచ్ చూడాలని ఉద్దేశంతో అక్కడ ఉండటానికి నరేంద్ర మోడీ స్టేడియం ప్రాంతంలో ఉన్న హాస్పిటల్స్ పై కన్నేశారు. హాస్పిటల్ లో బెడ్స్ దొరికిన చాలనుకుంటూ కొందరు క్రికెట్ అభిమానులు మ్యాచ్ సందర్భంగా ఆస్పత్రిలో బస చేసేందుకు హాస్పిటల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారని వాటికి హాస్పిటల్ యాజమాన్యం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
చాలామంది హోటల్ దొరక హాస్పిటల్ లో బస చేసేందుకు ఆశక్తి చూపుతున్న సందర్భంగా ఆసుపత్రి మేనేజ్మెంట్లు కూడా బెడ్స్ ధరలను సడన్గా పెంచేశాయి. ఆ సమీపంలో ఏ హాస్పిటల్లో అయినా ఒక రోజు ఉండాలంటే రూ.2 నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారట. పైగా ఇక్కడ ఉండడానికే కాకుండా ఆహారం ఉచితం, పూర్తి హెల్త్ చెకప్ ఇస్తామంటూ ఆసుపత్రులు అనౌన్స్ చేయడంతో రోగితోపాటు ఇంకొకరు కూడా ఉండే అవకాశం కూడా ఉండడంతో మెజారిటీ ఫ్యాన్స్ హాస్పటల్స్‌కి ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5 నుంచి ప్రపంచ కప్ సంబరాలు మొదలుకానున్నాయి. ఈ టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వార్ అక్టోబర్15న జరుగుతుంది.