జైల‌ర్ రివ్యూ… బాషా రేంజ్ బ్యాక్‌డ్రాప్‌తో ర‌జ‌నీకి హిట్ ప‌డిందా…!

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన జైల‌ర్ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షోలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, ఇంట్రో సీన్ నెక్ట్స్ లెవెల్ అని అంటున్నారు. కామెడీ సీన్లు అయితే అదిరిపోయాయ‌ట‌. ఇక డైలాగుల‌తో పాటు తెలుగు డబ్బింగ్ అన్నీ చాలా ప‌ర్‌ఫెక్ట్‌గా కుదిరాయ‌ని.. టైగర్ కా హుకుమ్ పాట, ఇంట్రవెల్ ఎలివేషన్ అదిరిపోయాయని సినిమా చూసిన జ‌నాలు చెపుతున్నారు.

ఇక ర‌జ‌నీ బ్లాక్ బస్టర్ కొట్టడానికి ద‌గ్గ‌ర్లోనే ఉన్నాడ‌ని అంటున్నారు. ఇక ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ రజినీతోనూ డార్క్ కామెడీనే పండించినట్టు చెపుతున్నారు. రజినీని ఈ జైలర్ ట్రైలర్‌లో చూస్తే చాలా కొత్తగానే అనిపిస్తోంది. ఇక జైల‌ర్‌లోనూ భాషా లాంటి బ్యాక్ డ్రాప్ కూడా పెట్టాడంటున్నారు.

రజినీ యాక్టింగ్ స్టైల్ మాత్రం ఇందు వేరే లెవ‌ల్లో ఉంద‌ని అంటున్నారు. ద‌ర్శ‌కుడు నెల్సన్ మేకింగ్ ఇందులోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత సీరియస్‌ సీన్ ఉన్నా కూడా అందులోనూ కామెడీ పెట్టడం నెల్సన్ స్టైల్ .. జైల‌ర్‌లోనూ అదే ఫాలో అయ్యాడంటున్నారు. ఇక పూర్తి రివ్యూతో జైల‌ర్ రేంజ్ ఏంట‌న్న‌ది తేలిపోనుంది.