త్రిష‌కు చిత్ర నిర్మాణ సంస్థ వార్నింగ్‌..

కొంటె చూపుల‌తో.. చిలిపి న‌వ్వుల‌తో,, అంద‌చందాల‌తో ఆక‌ట్టుకునే ద‌క్షిణాది హిరోయిన్ల‌లో త్రిష ఒక‌రు. ‘నీమనసు నాకు తెలుసు’ సినిమా ద్వారా తెలుగు తెర‌కు పరిచయ‌మై ఈ భామ అటు త‌రువాత ప‌దేళ్ల క్రితం వ‌ర‌కు తెలుగు చిత్ర‌సీమ‌ను సైతం శాసించింది. అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించి భారీ విజ‌యాల‌ను సొంతం చేసుకుంది. అందులో మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ప్ర‌భాస్‌, గోపీచంద్ త‌దిత‌రులున్నారు. ఆ త‌రువాత కాలంలో చేసిన సినిమాలు బాక్సాఫీసు వ‌ద్ద బోల్తా కొట్ట‌డడంతో ఈ భామ ఇక చైన్న‌య్‌కే ప‌రిమిత‌మైంది. అక్క‌డ ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌ను చేస్తున్న‌ది. గ‌తేడాది విజ‌య‌సేతుప‌తితో క‌లిసి న‌టించిన 96 సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. ఇదిలా ఉండ‌గా.. త్రిష‌కు ఓ చిత్ర నిర్మాణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడ‌దే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రి ఎందుకు వార్నింగ్ ఇచ్చిందంటే..

హీరోయిన్ త్రిష ప్ర‌ధాన పాత్ర‌లో 24 హౌస్ ప్రోడ‌క్ష‌న్స్ తిరుజ్ఞానం దర్శకత్వంలో ప‌ర‌మ‌ప‌దం విల‌యాట్టు సినిమాను తెర‌కెక్కించింది. ఆ సినిమా ఈ నెల 28న ప్రేక్ష‌కుల మందుకు రానుంది. అందులో భాగంగా చిత్ర‌ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్రిరిలీజ్ ఈవెంట్‌ను ఇటీవ‌లే చైన్నైలోని స‌త్యం థియేట‌ర్‌లో మూవీ నిర్మాణ సంస్థ నిర్వ‌హించింది. అయితే ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాకుండా సినియ‌ర్ క‌థానాయికి డుమ్మా కొట్టింది. ఇది చిత్ర బృందానికి ఆగ్ర‌హాన్ని తెప్పించింది. దీనిపై సినీ నిర్మాతల మండలి సైతం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ప్రధాన పాత్రలో నటిస్తోన్న త్రిషనే చిత్ర‌ ప్రచారకార్యక్రమంలో పాల్గొనకపోవడం ఏంట‌ని గుర్రుగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర దర్శక నిర్మాతలు త్రిష‌కు వార్నింగ్ సైతం ఇచ్చిన‌ట్లు తెలుస్తున్న‌ది. రెండురోజుల్లో సినిమా ప్రమోషన్‌కు రాకపోతే త్రిష తీసుకున్న పారితోషికంలో సగం వెనక్కివ్వాలని హెచ్చరించిన‌ట్లు ప్ర‌చారం జోరుగా సాగుతున్న‌ది. మ‌రి త్రిష ఎలా స్పందిస్తుందో? ప‌్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రవుతుందో? లేదో చూడాలి?

Tags: 24 movie productions, parampadam villattu mo vie, thrisha