హీరోయిన్ జ‌యంతిపై ఆ టైప్ రూమ‌ర్లు… హ‌ర్ట్ అయిన ఎన్టీఆర్‌…!

ఓల్డ్ మూవీల్లో జ‌యంతి గురించి అంద‌రికీ తెలిసిందే. పాత సినిమాల్లో హీరోయిన్ స్నేహితురాలిగా, చెల్లిగా, అక్క‌గా.. క్యారెక్ట‌ర్ పాత్ర‌లు పోషించిన జ‌యంతికి పెద్ద హిట్ మూవీ ఏదైనా ఉంటే.. అంతులేనిక‌థ సినిమా నే. ఈ సినిమాలోనూ.. ఆమె సెకండ్ హీరోయిన్‌గా న‌టించిన ఫ‌టాఫ‌ట్ జ‌య‌లక్ష్మికి త‌ల్లిపాత్ర పోషించింది. కానీ, సినిమాలో మంచి పేరు వ‌చ్చింది. సినిమాలో త‌ల్లి, కూతుళ్ల‌ను ఒక‌డు మోసం చేసే స్టోరీ ఉంటుంది.

Kondaveeti Simham (1981) - IMDb

దీనిని బాల‌చంద‌ర్ చాలా హైలెట్ చేశారు. ఈ పాత్ర‌లో జ‌యంతి పూర్తిగా లీన‌మై న‌టించింది. సినిమాలో జ‌య‌ప్ర‌ద‌కు ఎంత పేరు వ‌చ్చిందో క్యారెక్ట‌ర్ న‌టుల్లోజ‌యంతికి మంచి పేరు వ‌చ్చింది. ఈ సినిమాను వీక్షించిన అన్నగారు.. జ‌యంతిని మెచ్చుకున్నారు కూడా..! అలాంటి జ‌యంతి త‌ర్వాత కాలంలో అనేక సినిమాలు చేశారు. అన్న‌గారి పక్కన కూడా భార్య‌గా న‌టించారు. అయితే.. అనూహ్యంగా త‌మిళ ప‌త్రిక‌ల్లో జ‌యంతి గురించి వ్య‌తిరేక వార్త‌లువ‌చ్చాయి.

జ‌యంతి.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టే కాదు.. ఆమె వేరే కార్య‌క్ర‌మాలు. ఇత‌ర త‌ర‌హా ప‌నికూడా చేస్తోందంటూ.. ఒక మ్యాగ‌జైన్‌లో పెద్ద స్టోరీ వ‌చ్చింది. దీంతో జ‌యంతి విష‌యం ఒక్క‌సారిగా వివాదంగా మారింది. అప్ప‌టికే సినిమాలు బుక్ చేసుకున్న వారు.. అడ్వాన్సులు వెన‌క్కి తీసేసుకుని.. ఆమెను ప‌క్క‌న పెట్టారు. నిజానికి జ‌యంతి చాలా ప‌ద్ధ‌తిగ‌ల క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు.

Kondaveeti Simham Movie || Maa Intilona Mahalakshmi Video Song || NTR,  Sridevi - YouTube

అయితే.. కావాల‌నే ఇది రాశారంటూ.. ఆమె కోర్టుకు వెళ్లారు. ఈ విష‌యం ఆనోటా ఈనోటా అన్న‌గారికి తెలిసింది. చాలా బాధ‌ప‌డ్డారు. త‌ర్వాత‌.. కోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పురావ‌డం.. ప‌త్రిక నుంచి 10 ల‌క్ష‌లు ప‌రిహారంగా కూడా ఇప్పించారు. ఇది తెలిసి.. అన్న‌గారు.. మంచి ప‌నిచేశారు. మీరు చేసిన సాహ‌సం.. మ‌రింత మందికి దారి చూపిస్తుంది. అని ప్ర‌శంసించారు. జ‌యంతి పాత్ర‌లు ప్ర‌త్యేక శైలితో ఉండేవి.