ఎన్టీఆర్ ఇన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు రిజెక్ట్ చేశాడా… ఏం సూప‌ర్ హిట్లురా బాబు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాతో నందమూరి నట‌వార‌సుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించాడు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించిన ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్.. తన నటనతో గ్లోబల్ స్టార్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో చాలా సినిమాలను రిజెక్ట్ చేశాడు. వాటిలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Raja The Great Review Raja The Great Movie Review

నితిన్ హీరోగా వివి వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో వచ్చిన తెలుగు సినిమా దిల్. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఎంత బ్లాక్ బ‌స్టర్ రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట ఈ సినిమాను వివి. వినాయక్ ఎన్టీఆర్ తోనే చేయాలనుకున్నాడట. అయితే ఈ కథను ఎన్టీఆర్ కి వినిపించగా ఈ కథ ఎన్టీఆర్ కి నచ్చినప్పటికీ ఏవో కారణాల చేత రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య మూవీ కి కూడా మొదటిగా ఎన్టీఆర్ ఏ హీరోగా అనుకున్నాడట సుకుమార్.

Aarya (Telugu) telugu | Sun NXT

ఇలాంటి లవ్ స్టోరీ తనకు సెట్ కాదని ఎన్టీఆర్ ఆర్య సినిమాని సున్నితంగా రిజెక్ట్ చేశాడట. మహేష్ బాబు – శృతిహాసన్ జంటగా నటించిన శ్రీమంతుడు సినిమా మహేష్ బాబుకి ఎంత క్రేజ్‌ తెచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో కూడా మొదట ఎన్టీఆర్ నే హీరోగా తీసుకోవాలనుకున్నారట మూవీ మేకర్స్. కొర‌టాల కూడా ఈ క‌థ ఎన్టీఆర్‌కు బాగా సెట్ అవుతుంద‌నే అనుకున్నాడ‌ట‌.

Bhadra (2005) - IMDb

అయితే అప్పుడు ఎన్టీఆర్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండ‌డంతో ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేశాడు. దీంతో పాటే రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శ‌కత్వంలో రిలీజైన‌ భద్ర, అలాగే కిక్, రాజా ది గ్రేట్ ఈ మూడు సినిమాలు రవితేజకు తిరుగులేని స్టార్‌డం తెచ్చిపెట్టాయి, వాటితో పాటు నాగార్జున – కార్తీక్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఊపిరి వంటి సూపర్ హిట్ సినిమాలో కూడా మొదటగా ఎన్టీఆర్ ని అనుకున్నారట. ఎన్టీఆర్ ఈ సినిమాల‌ని కూడా రిజెక్ట్ చేశాడు. అలా ఎన్టీఆర్ హిట్ ఖాతా నుంచి ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు చేజారిపోయాయి.