గబ్బ‌ర్‌సింగ్ సినిమాలో శృతీహాస‌న్‌ను హీరోయిన్‌గా వ‌ద్ద‌న్న ఆ ఇద్ద‌రు… రాద్దాంతం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన సినిమాల‌లో గ‌బ్బ‌ర్‌సింగ్ ఒక‌టి. బాలీవుడ్‌లో స‌ల్మాన్‌ఖాన్ హీరోగా వ‌చ్చి సూప‌ర్ హిట్ కొట్టిన ద‌బాంగ్ సినిమాకు రీమేక్‌గా గ‌బ్బ‌ర్‌సింగ్ తెర‌కెక్కింది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా 2012లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది.

Gabbar Singh (2012)

 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస ప్లాపుల‌కు బ్రేకులు వేసిన సినిమా గ‌బ్బ‌ర్‌సింగ్‌. ఈ మూవీని ప‌ర‌మేశ్వ‌ర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించగా … రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సినిమాలో పాట‌లు అన్నీ సూప‌ర్ హిట్‌. ఇక ఈ సినిమా ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌లో స‌ల్మాన్‌ఖాన్‌కు జోడీగా సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా న‌టించింది.

ఈ సినిమాలో శృతీహాస‌న్‌ను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకున్న‌ప్పుడు పెద్ద డిస్క‌ర్ష‌న్లే న‌డిచాయ‌ట‌. నిర్మాత బండ్ల గ‌ణేష్ అయితే.. ఆమె ఓ పెద్ద ఐరెన్‌లెగ్‌… ఆమెకు అన్నీ ప్లాపులే.. ఆమె హీరోయిన్‌గా వ‌ద్ద‌ని చెప్పాడ‌ట‌. అటు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కూడా తాను మ‌రో హీరోయిన్‌కు మాట ఇచ్చాను.. ఆమెనే హీరోయిన్‌గా తీసుకుందాము.. శృతీహాస‌న్ వ‌ద్ద‌ని చెప్పాడ‌ట‌.

I was making a bigger film than Dabangg' - Rediff.com Movies

వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చిర్రెత్తుకొచ్చింద‌ట‌. నిర్మాత బండ్ల‌తో నీకు ఏమైనా పెద్ద హిట్లు ఉన్నాయా ? ఆ అమ్మాయికి నేను మాట ఇచ్చాను.. ఆమెనే హీరోయిన్‌గా తీసుకోండి.. ఫిక్స్ అయిపోండ‌ని గ‌ట్టిగానే చెప్పాడ‌ట‌. దీంతో నిర్మాత గ‌ణేష్‌, ద‌ర్శ‌కుడు హ‌రీష్ ఇద్ద‌రూ కూడా చివ‌ర‌కు శృతీనే హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యారు. ఆ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఐరెన్‌లెగ్ శృతి కాస్తా గోల్డెన్ లెగ్ అయ్యింది.