రానాకు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా… ముందుగా ఆ హీరో పేరే పెట్టాల‌నుకున్నారా..!

టాలీవుడ్ దివంగత అగ్ర నిర్మాత రామానాయుడు కుటుంబం నుంచి మూడోతరం వారసుడుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు రానా. రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు పెద్దకొడుకు రానా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే తన నటనలోని వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను అలరించాడు. రానా కేవలం తెలుగు సినిమాలలోనే కాకుండా తమిళ్, హిందీ.. ఇలా భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Rana Daggubati: Didn't go to college so never connected with college stories

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో బల్లాల దేవుడిగా నటించి తన నటనలోని నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపించాడు. ఈ సినిమాతో తన క్రేజ్‌ నేషనల్ వైడ్‌గా పెంచుకున్నాడు. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్‌ కాపాడుకుంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తూ వస్తున్నాడు. రానా సోలో హీరో గానే కాకుండా అటు మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తూ ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నాడు. బాహుబలి, భీమ్లా నాయక్, రుద్రమదేవి వంటి సినిమాలే వాటికి నిదర్శనం.

రానా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే మిహికా బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించ‌గా… ఇరు కుటుంబాల అంగీకారంతో 2020లో ఒకటయ్యారు. రానా పేరు విషయానికి వస్తే ఎవరు ఊహించని పెద్ద కథ ఒకటి ఉంది. రానా అసలు పేరు రామానాయుడు. రానా అనే పేరు ఎలా పెట్టారో ఇప్పుడు చూద్దాం. ఇక రానాకు ముందుగా తన తల్లి లక్ష్మి సిద్దార్థ్ అనే పేరు పెట్టాలని నిర్ణయించింది. కొడుకు బారసాల చేయించే రోజున తండ్రిని మీ కొడుకు పేరు రాయాలని చెప్పగా అప్పుడు సురేష్ బాబు తన తండ్రి పేరు రామానాయుడు అని రాశాడు.

Rama Naidu: Movie mogul who modernised film-making in the south - The Hindu

ఆ పేరుని తన కొడుకుకి పెట్టాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు సురేష్ బాబు.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తన కొడుకుకి ఆ పేరు పెట్టాడు. సురేష్ బాబు భార్య భర్త చేసిన పనికి ఏమీ అనలేక ఆ పేరుని తన కొడుకుకి పెట్టింది. రామానాయుడు మాత్రం తన కొడుకు చేసిన పనికి ఎంతో ఆనందించాడు. సురేష్ బాబు స్నేహితుల్లో కొందరు రామానాయుడు గారి మీద ఉన్న గౌరవంతో ఆ పేరుతో సురేష్ బాబు కొడుకుని పిలవలేక రామానాయుడు అనే పేరులో ఉన్న మొదటి అక్షరాలు కలిపి రానా అని పిలుస్తామని చెప్పారట.

అప్పుటి నుంచి రామానాయుడు పేరు కాస్త రానాగా మారింది. ఆ పేరుతోనే రానా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. రానా పేరు వెనుక ఉన్న అసలు కథ ఇది. ఈ విషయాన్ని రానా ఓ ఇంటర్వ్యూ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఒక వేళ రానాకు ముందు అనుకున్న పేరు పెట్టి ఉంటే అప్పుడు ఇండ‌స్ట్రీలో ఇద్ద‌రు సిద్ధార్థ్‌లు ఉండేవారు.