టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన మూవీ ఖుషి.. ఇక ఇందులో సమంత హీరోయిన్‌గా.. శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్గా నిర్మించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని ఎందుకు చూడాలి..? ఖుషి సినిమాకి స్పెషల్ ఎట్ట్రాక్షన్స్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
1. ఈ సినిమాకు మొదటి ప్లస్ పాయింట్ విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో విజయ్ సినిమా చేస్తే ఖచ్చితంగా అవి హిట్ అవ్వాల్సిందే. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ నటించిన సినిమాలలో మనం కచ్చితంగా ఇది గమనించాలి.. పెళ్లిచూపులు, గీతాగోవిందం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. అర్జున్ రెడ్డిలో సైతం బలమైన ప్రేమ కథ ఉంది. డియర్ కామ్రేడ్ సినిమా మాత్రం ఓ సెక్షన్ ఆఫ్ ప్రేక్షకులకు మాత్రమే నచ్చింది. ఇక ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ ప్రేమికుడిగా లవ్ మ్యారేజ్ చేసుకున్న భర్తగా నటించాడు.
2. ఈ సినిమాకి రెండో ప్లస్ పాయింట్ ఏమిటంటే విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన తొలి సినిమా కూడా ఇదే.. ఈ కాంబినేషన్ సినిమాకి కావాల్సినంత క్రేజ్ తీసుకువచ్చింది.. వెండితెరపై ఈ జంటను చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి కూడా.. పైగా ప్రేమ పెళ్లి నేపథ్యంలో సినిమా అంటే సమంత ఎంత అద్భుతంగా నటిస్తుందో ఆమె గత సినిమాలు చూస్తే అర్థమవుతుంది.. అదేవిధంగా ఆమె నటనకు తోడు చిన్నయి డబ్బింగ్ కూడా ఈ సినిమాకు కలిసి వస్తుంది. ఇక ట్రైలర్ లో సమంత కెమిస్ట్రీ కూడా ఎంతో అద్భుతంగా ఉంది.
3. ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ బాగా గుర్తుకు వచ్చేది సినిమా మ్యూజిక్ అండ్ పాటలు.. ఈ సినిమాకి మలయాళ సంగీత దర్శకుడు హిషామ్ అబ్దుల్ వాహెబ్ మ్యూజిక్ అందించాడు.. సినిమా రిలీజ్ కు ముందు నుంచే పాటలు విజయంలో కీలకపాత్రర పోషించాయి.. ఈ సినిమా విడుదల కంటే ముందే ఖుషి పాటలతో సంగీత దర్శకుడు హిషామ్ అబ్దుల్ వాహెబ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. సినిమా పాటలతో సినిమాపై అంచనాలు పెంచేశాడు.
4. ఖుషి కి మరో మెయిన్ ఎట్రాక్షన్.. సినిమా స్టోరీ.. ఈ సినిమా కథ వివాహ వ్యవస్థ చుట్టూ తిరుగుతూ ఉంటుంది.. గతంలో పోలిస్తే ఇప్పుడు వివాహ వ్యవస్థలో మార్పులు వచ్చాయి ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి.. ఇంకా సూటిగా చెప్పాలంటే పెద్దలను కాదని వేరు కాపురాలు పెడుతున్న జంటలు సైతం సమాజంలో ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ పెళ్లి తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయని కథతో ఖుషిసినిమా వచ్చింది.. ట్రైలర్ చూస్తేనే అదే అర్థమవుతుంది. ఇక ఇప్పటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ ఇది థియేటర్లో ప్రేక్షకులకు సర్ప్రైజ్లు ఉంటాయని మరో రెండు క్యారెక్టర్లు ఉన్నాయని సంగీత దర్శకుడు కూడా చెప్పారు.
5. విజయ్ దేవరకొండ, సమంత ఈ సినిమా చేయడానికి… మైత్రీ మూవీ మేకర్స్ అన్ని డబ్బులు ఖర్చు చేయడానికి… హిషామ్ మంచి బాణీలు ఇవ్వడానికి… కారణమైన ఈ కథను రాసింది దర్శకుడు శివ నిర్వాణ. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే… ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాల్లో పాత్రల మధ్య సంఘర్షణను ఆయన తెరకెక్కించిన తీరు మనసుకు హత్తుకునేలా ఉంటుంది. సున్నితమైన భావోద్వేగాలను చాలా చక్కగా శివ నిర్వాణ చూపిస్తారు. ‘ఖుషి’లో ఏం చేశారో? వెయిట్ అండ్ వాచ్.