ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్.. ఈ వైసీపీ వాళ్లు కూడా చంద్రబాబు సీఎం అవ్వాల‌ని కోరుకుంటున్నారు..?

ఏపీలో అధికార వైసీపీపై సొంత పార్టీలోనే చాలామందికి తీవ్రమైన అసహనం, అసంతృప్తి ఉన్నాయన్నది వాస్తవం. గత ఎన్నికలలో జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఎంతోమంది ఎన్నో విధాలా కష్టపడ్డారు. ఆర్థికంగా అప్పులు చేసి ఎన్నికల ప్రచారం చేసిన వారు కూడా ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే తమ కష్టాలు తీరిపోతాయని వారంతా ఎన్నో కలలు కన్నారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా విస్మరించిన పరిస్థితి కనిపిస్తోంది.

జగన్ ప్రభుత్వ పథకాలు.. తను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకే వెళ్లాలన్న ఆలోచనతో ఒలంటీర్లు వ్యవస్థతోపాటు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు ప్రజాప్రతినిధులకు మధ్య కనెక్షన్ తెగిపోయింది. ఎవరికి ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే వాలంటీర్లు, గ్రామ సచివాలయాల ద్వారా చక చక జరిగిపోతున్నాయి.

దీనికి తోడు తాజాగా గృహ సార‌థులను కూడా తీసుకువచ్చారు. తెలుగుదేశం పాలనలో ఎవరికి ఏ సాయం కావాలన్నా ఏ పని జరగాలన్నా ? నాయకులు గ్రామాల్లో ఉన్న కార్యకర్తల ద్వారా ఎమ్మెల్యేల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. వారు అధికారులకు సిఫార్సు చేసేవారు. దీంతో మధ్యలో ఉన్న పార్టీ నాయకులతో పాటు అటు ఎమ్మెల్యేకు తగిన గౌరవం దక్కేది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక మధ్యలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి డమ్మీలు అయిపోయారు.

చివరకు ఎవరికి వారు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా పనులు చేయించుకోవడంతో ఎమ్మెల్యేల ప్రాధాన్యత కూడా తగ్గింది. చివరకు వైసీపీ అధికారంలో ఉందని లక్షల రూపాయల ఖర్చు చేసి సర్పంచులుగా.. ఎంపీటీసీలుగా, జడ్పిటిసిలుగా గెలిచిన వైసిపి ప్రజాప్రతినిధులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వారంతా లక్షల రూపాయలు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేసి ఉన్నారు. బిల్లులు మంజూరు కావడం లేదు.. లక్షల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.

ఎమ్మెల్యేలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. దీనితో వారంతా లబోదిబోమంటున్నారు. మరికొందరు అయితే ఉన్న ఆస్తులు అన్ని అమ్ముకుని అప్పులు కట్టుకుంటున్నారు. కొత్త పనులు మంజూరు కావు.. చేసిన పన్నులకు బిల్లులు లేవు. ఇటు గ్రామాల్లో తమ ప్రమేయం లేకుండానే ఎవరికి వారికి పనులు అయిపోతున్నాయి. దీంతో సర్పంచుల గౌరవం కూడా తగ్గిపోయింది.

ఇక పంచాయతీ ఖాతాలో కేంద్ర ప్రభుత్వం వేస్తున్న నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసుకుంటుంది. చివరకు వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లోనే చాలామంది ప్రభుత్వం మరితే తప్ప తమకు గుర్తింపు గౌరవంతో పాటు తమ బిల్లులు మంజూరు కావని బాధపడుతున్న పరిస్థితి. ఏదేమైనా వైసీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీసం తమ తమ గ్రామాల్లోనే సరైన గుర్తింపు, గౌరవం లేని పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp