ఈ సారి నెల్లూరులో టిడిపికి ఐదు సీట్లు పక్కా ఫిక్స్… ఆ సీట్లు ఇవే…!

ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల విడిది అప్పుడే ప్రారంభమైంది. ఓవైపు లోకేష్ యువ‌గళం పాదయాత్రతో ప్రజల్లో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సైతం పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి ఎలా ?తీసుకురావాలా అని రకరకాల స్కెచ్ లు వేస్తున్నారు. అయితే ఈసారి వైసీపీ ఆవిర్భావం నుంచి కంచుకోటలుగా ఉంటున్న కొన్ని జిల్లాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కడప, కర్నూలు, నెల్లూరు లాంటి జిల్లాలు వైసిపి పెట్టినప్పటి నుంచి ఆ పార్టీ వైపే ఉంటున్నాయి. 2014లో తెలుగుదేశం గెలిచినప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ మూడు సీట్లలో మాత్రమే గెలిచింది.

ఉదయగిరి, వెంకటగిరి, కోవూరులో తెలుగుదేశం అభ్యర్థులు అతి స్వల్ప మెజార్టీలతో మాత్రమే గట్టెక్కారు. ఇక గత ఎన్నికల్లో అయితే జిల్లాలో నెల్లూరు ఎంపీ సీటుతో పాటు పది అసెంబ్లీ సీట్లలో వైసిపి పాగావేసేసింది. ప్రస్తుతం వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాల కారణంగాను వైసీపీ క్యాడర్లో తీవ్రమైన అసంతృప్తి ఉండడంతో నెల్లూరు జిల్లాలో పరిస్థితి మారుతుంది. ఇప్పుడున్న సర్వేలు అంచనాల ప్రకారం చూసిన నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం అతి సునాయాసంగా ఐదు సిట్లలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటికే వైసీపీకి దాదాపు దూరమయ్యారు. అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం విజయం ఖాయమైనట్టే చెబుతున్నారు. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీలో కచ్చితంగా ఉంటారని తెలుస్తోంది. ఇక ఆనం టీడీపీ త‌ర‌పున‌ వెంకటగిరి నుంచి పోటీ చేస్తారా లేదా ఆయన సొంత నియోజకవర్గం ఆత్మకూరు నుంచి బరిలోకి దిగుతారా ? అన్నది క్లారిటీ లేదు.

ఏది ఏమైనా ఆనం టిడిపిలోకి వస్తే వెంకటగిరిలో తెలుగుదేశంకు చాలా ప్లస్ అవుతుంది. ఇక నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణ పోటీలో ఉంటే ఈసారి కచ్చితంగా సానుభూతితో ఆయన గెలుస్తారనే అంటున్నారు. ఇక 2014లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన ఉదయగిరి నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సులువుగా విజయం సాధిస్తారని అంటున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పై తీవ్రమైన వ్యతిరేక గాలులు వీస్తున్నాయి.

అక్కడ ఆయన ను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. ఇక వైసిపి అధిష్టానం కూడా వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డికి సీటు ఇవ్వదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక కోవూరులోనూ ఈసారి తెలుగుదేశం విజయం సాధించేదిగా దూసుకుపోతోంది. ఏదేమైనా వైసీపీ కంచుకోటలో ఈసారి సీన్ అయితే రివర్స్ అవుతోందన్నది వాస్తవం. మరి ఈ అవకాశాన్ని తెలుగుదేశం శ్రేణులు ఎలా ఉపయోగించుకుంటాయో చూడాలి.

Tags: ap politics, chandra babu naidu, latest news, Latest P0litical News, lokesh, political news, tdp, tdp leaders, ysrcp