ఈ సారి ప‌క్కాగా గెలిచే టీడీపీ ఎమ్మెల్యే ఇత‌డే… డ్యామ్ షూర్ విన్నింగ్ సీట్ అదే..!

ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరాని నియోజకవర్గం…ఇక్కడ టి‌డి‌పి మంచి విజయాలు ఏమి సాధించలేదు. ఎప్పుడో 1985లో ఒకసారి..మళ్ళీ 1999 ఎన్నికల్లో అక్కడ టి‌డి‌పి విజయం సాధించింది. అంతే మళ్ళీ అక్కడ టి‌డి‌పి గెలవలేదు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.

 

అయితే గత రెండు ఎన్నికల్లో టి‌డి‌పి తక్కువ మెజారిటీలతోనే ఓడిపోతూ వస్తుంది. కానీ ఈ సారి మాత్రం సంతనూతలపాడులో సీన్ రివర్ అవుతుంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా సుధాకర్ బాబు ఉన్నారు. ఈయనపై ఉన్న వ్యతిరేకత జిల్లాలో మరో ఎమ్మెల్యేపై లేదు. ఆ స్థాయిలో ఈయనపై వ్యతిరేకత ఉంది. నియోజకవర్గంలో అభివృద్ధి పెద్దగా లేదు..ప్రజాస సమస్యలకు పరిష్కరించడంలో వెనుకబడి ఉన్నారు. ఇవన్నీ పెద్ద మైనస్ అవుతుంటే..ఇటీవల అసెంబ్లీలో సుధాకర్ చేసిన ఓ పని వల్ల ఇంకా మైనస్ అవుతుంది.

స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న టి‌డి‌పి ఎమ్మెల్యేల్లో ఒకరైన స్వామిపై సుధాకర్ దాడి చేశారు. కిందకు తోసేశారు. పైగా చేతికి ఏదో గీత గీసుకున్నది చూపించి..దానికి పెద్ద కట్టు వేసి..అదిగో తనపై టి‌డి‌పి ఎమ్మెల్యేలు దాడి చేశారని సింపతీ క్రియేట్ చేయడానికి చూశార‌ని సోష‌ల్ మీడియ‌లో ఆయ‌న‌పై ట్రోలింగ్ న‌డిచింది. పైగా ఆయ‌న గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. సంత‌నూత‌ల‌పాడుకు నాన్‌లోక‌ల్‌.

YSRCP MLA TJR SUdhakar Babu slams TDP over commenting over Govt - YouTube

నియోజ‌క‌వ‌ర్గంలో రెండు బ‌లమైన సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు ఈ సారి ఆయ‌న‌కు సీటు ఇస్తే ఓడిస్తామ‌ని శ‌ప‌థాలు చేస్తోన్న ప‌రిస్థితి. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి అన్న మాటే లేదు. పైగా గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ నుంచి ఓడిపోతోన్న మాజీ ఎమ్మెల్యే బీఎన్‌. విజ‌య్‌కుమార్ ప‌దేళ్లుగా ప‌ద‌వి ఉన్నా లేక‌పోయినా ప్ర‌జ‌ల్లోనే ఉంటూ వ‌స్తున్నారు. దీంతో ఆయ‌న‌కు ఈ సారి సానుభూతి ప‌వ‌నాలు బ‌లంగా వీస్తున్నాయి. ఇప్పటికే సంతనూతలపాడులో టి‌డి‌పి గెలవడం ఖాయమని ప‌లు సర్వేల్లో క్లీయ‌ర్ క‌ట్‌గా క‌నిపిస్తోంది.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp