తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ? అందరికీ తెలుసు. వారి సినిమాలు మొదటి రోజు రిలీజ్ అవుతున్నాయంటే థియేటర్లో కలెక్షన్స్ మోత మోగిపోతూ ఉంటుంది. అలాంటి స్టార్ హీరోల్లో ఎవరు ఎంత ? రెమ్యూనరేషన్ తీసుకుంటారు అనే దానిపైన చాలామందికి ఆసక్తి ఉంటుంది. హైయెస్ట్ రెమ్యునరేషన్ టాప్ టెన్ హీరోలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.
ప్రభాస్ :
తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వారిలో మొదటిగా ప్రభాస్ పేరు వినిపిస్తుంది. బాహుబలి సినిమాతో మొదటి పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. ప్రభాస్ కు ప్రస్తుతం చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఇదిలా ఉంటే ప్రభాస్ తను ఒక్కొక్క సినిమాకు రు. 100 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటాడట.
అల్లు అర్జున్ :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల తీసిన పూష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అతని క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం పుష్ప మూవీకి సీక్వల్‌గా వస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు దాదాపు రు. 80 నుంచి 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటాడట.
జూనియర్ ఎన్టీఆర్ :
నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి గ్లోబల్ స్టార్ అయ్యాడు. అయితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ 30 మూవీలో జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ రు. 70 – 80 కోట్ల రేంజ్ హీరో అయ్యాడు.
రామ్ చరణ్ :
మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ఎదుగుతూ గ్లోబల్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ అయినా చెర్రీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు చరణ్ ఒక్కో సినిమాకు దాదాపుగా 50 నుంచి 70 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు.
మహేష్ బాబు :
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయకపోయినా టాలీవుడ్లో ఆయన సినిమా వచ్చిందంటే రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంటాడు. 50 ఏళ్ళు వస్తున్నా మహేష్ బాబుకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆయన ఒక్కొక్క సినిమాకు దాదాపు రు. 60 నుంచి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.
రవితేజ :
మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం హిట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రవితేజ ఒక్కో సినిమాకు దాదాపు 15 నుంచి 20 కోట్ల వరకు సంపాదిస్తాడట.
విజయ్ దేవరకొండ :
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల తీసిన లైగర్ సినిమా డిజాస్టర్. అయినా మనోడికి కంటిన్యూగా సినిమా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం సమంత జోడిగా ఖుషి సినిమాలో నటిస్తున్నాడు విజయ్ ఒక్కో సినిమాకు రు. 20 – 25 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
ఇక సీనియర్ స్టార్ హీరోల విషయానికొస్తే …
పవన్ కళ్యాణ్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ హీరో. పవన్ ఒక్కో సినిమాకు దాదాపుగా 75 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడట. పవన్ కేవలం తెలుగు భాష వరకే సినిమాలు చేసినా ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
చిరంజీవి :
మెగాస్టార్ చిరంజీవి 70కు దగ్గర అవుతున్నా… ఇప్పటికీ సినిమాలలో నటిస్తున్నాడు. చిరు ఒక్కో సినిమాకు దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యూరేషన్ పుచ్చుకుంటున్నాడు.
బాలకృష్ణ :
బాలయ్య ప్రస్తుతం మాస్ సినిమాలతో దూసుకు వెళుతున్నారు. ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న ఎన్.బి.కె 108 సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. సీనియర్ హీరోలలో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరో బాలయ్య ఒక్కరే. బాలయ్య ఒక్కో సినిమాకు రు. 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.