చంద్ర‌బాబు నిజాయితీకి ఇదే సాక్ష్యం… దేశంలో టాప్ లీడ‌ర్లు అంతా బాబు వెంటే…!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాజకీయ పక్షాలు.. ప్రతిపక్షాల నుంచే కాకుండా జాతీయ స్థాయిలో రాజకీయ మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండించారు. అటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వ‌రితో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా చంద్రబాబు అరెస్టు తీరును ముక్తకంఠంతో ఖండించాయి.

తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు కూడా జగన్ ప్రభుత్వం కేవలం రాజకీయ ఖర్చుతోనే చంద్రబాబును అరెస్టు చేసిందని విమర్శలు చేస్తున్నాయి. ఇక జాతీయస్థాయిలో తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయంలో ముందు నిలిచారు. రాజకీయ క‌క్ష‌ సాధింపే చంద్రబాబు అరెస్ట్ కు కారణమని మమత తేల్చి చెప్పారు.

తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ – నేషనల్ కాన్ఫరెన్స్ నేత జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి పారుక్ అబ్దుల్లా – శిరోమణి అకాళిద‌ళ్‌ అధ్యక్షుడు సుక్వీర్ సింగ్ బాద‌ల్‌, కర్ణాటక మాజీ సీఎం జీడీఎస్ నేత కుమారస్వామి – ఆర్ జె డి ఎంపీ మనోజ్ వంటి సీనియర్ నాయకులు చంద్రబాబు అరెస్టును ఖండించారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఏది ఏమైనా జాతీయ‌ స్థాయిలో చంద్రబాబుకు రాజకీయంగా కీలక నేతల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. ఇది రాజకీయంగా వైసిపిని బాగా డిఫెన్స్ లో పడేస్తోంది.