ష‌ర్మిల – విజ‌య‌మ్మ -బ్ర‌ద‌ర్ అనిల్‌తో జ‌గ‌న్‌కు ద‌బిడి దిబిడే…!

ఏపీలో ప్రస్తుత రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయ్యి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలు వైసీపీ అధినేత జగన్‌కు అంత ఈజీ కాదని క్లియర్ కట్‌గా తెలుస్తోంది. ఓవైపు రోజురోజుకు పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఇటు చంద్రబాబును అరెస్టు చేయడంతో ఒక్కసారిగా మారుతున్న రాజకీయం.. దీనికి తోడు గత ఎన్నికలలో తనకు బలంగా సపోర్ట్ చేసిన చెల్లి షర్మిల -తల్లి వైఎస్ విజయలక్ష్మి ఈసారి దూరంగా ఉండటం.. అటు షర్మిల భర్త జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ ప్రచారం కూడా లేకపోవడం లాంటి అంశాలు ఈసారి జగన్‌కు పెద్ద ఎదురుదెబ్బ కానున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గత ఎన్నికలలో జగన్ గెలుపు కోసం చెల్లి ష‌ర్మిలతో పాటు తల్లి విజయలక్ష్మి బలంగా ప్రచారం చేశారు. ఆ మాటకు వస్తే పార్టీ పెట్టినప్పటి నుంచి గత ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి చేసేంతవరకు వీరిద్దరు నిద్రపోలేదని చెప్పాలి. ష‌ర్మిల అయితే బైబై బాబు అనే నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లారు. ఇక అన్న కోసం ష‌ర్మిల రికార్డు పాద‌యాత్ర చేశారు.

అయితే ఈ ఎన్నికల్లో వీరిద్దరూ ప్రచారం చేసే ఛాన్సే లేదు. ఎప్పటికి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక బ్రదర్ అనిల్ కుమార్ ప్రచారం క్రిస్టియన్ ఓట్లపై గత ఎన్నికలలో గట్టిగా ప్రభావం చూపింది. ఈసారి ఆ ప్లస్ పాయింట్ కూడా జగన్‌కు లేకుండా పోయింది. ఈ పరిణామాల్ని చూస్తే ఈసారి జగన్‌కు కచ్చితంగా దబిడి దిబిడే అని చెప్పాలి.