టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన టాలెంట్‌తో ఫుల్ క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. ఎన్నో కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీసి అన్ని వర్గాల ప్రేక్షకులలోను అభిమానులను సంపాదించుకున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు చాలామంది టాలీవుడ్ స్టార్ హీరోలు డ్యూయల్ రోల్స్ లో నటించి మెప్పించిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొంతమంది ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. అయితే అలా మహేష్ బాబుకు పెద్దగా చెప్పుకోదగ్గ డ్యూయల్ రోల్స్ లేవని తెలుస్తుంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురం, బాల చంద్రుడు, అన్నా తమ్ముడు వంటి సినిమాల్లో డ్యూయల్ రోల్ లో నటించాడు.
కానీ మహేష్ బాబు హీరో అయ్యాక మాత్రం డ్యూయల్ రోల్ లో ఒకే ఒక సినిమాలో నటించాడట. ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన నాని సినిమాలో మహేష్ బాబు నటించాడు. మూవీ చివరికి వచ్చిన కొద్దిసేపు మాత్రమే తండ్రి కొడుకులుగా మహేష్ కనిపిస్తాడు. ఈ సినిమా విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.