దివంగత నటుడు, నేత నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు తాజాగా జరాగాయి. ఈ సందర్భంగా నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాణాని చేజక్కించుకోవడం కోసం ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం పోటీ పడుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీ నుంచి అభిమానులు హైదరాబాద్, సైఫాబాద్ మింట్ మ్యూజియంలో నాణేలు కోసం లైన్లో నిలబడి మరి చేజాక్కించుకుంటున్నారు.
గంటల తరబడి లైన్ లో నిలబడి నాణెం కొనుగోలు చేస్తున్నారు. 100 రూపాయల స్మారక నాణంని మూడు ధరల్లో నిర్ణయించి అధికారులు అమ్ముతున్నారు. రూ. 4,850, రూ. 4,380, రూ. 4,050 గా నిర్ణయించి అధికారులు గిఫ్ట్ బాక్స్ తో ఈ నాణాన్ని అమ్మకాలు జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మకాలు జరిగే ప్రదేశంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలల్లో క్యూ కట్టారు.