సినిమాలు మానేశాక శోభన్ బాబు బయట కనిపించకపోవటానికి కారణం.. ఆ స్టార్ హీరోయిన్ మాటలేనా..!?

మన తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ సోగ్గాడిగా మిగిలిపోయిన శోభన్ బాబు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే…. ఆయ‌న చిత్ర‌ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అన్ని హీరోల పాత్రల్లోనే నటించాడు తప్ప వయసు పెరిగిన కొద్దీ ఆయనకు తగ్గ పాత్రల్లో అడిగితే అస్సలు నటించలేదు. అంతేకాదు మూడున్నర దశాబ్దాలు ఆయన ఇండస్ట్రీని ఏలినప్పటికీ ఆ తర్వాత వయసు మీద పడ్డాక సినిమాల్లో నటించడానికి అసలు ఒప్పుకోలేదు.

అంతేకాకుండా ఎన్నో సినిమాల్లో ఈయనకు హీరో గానే కాకుండా ముఖ్యపాత్రల్లో అవకాశం వచ్చినప్పటికీ రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తం అన్నప్పటికీ కూడా ఆయన సినిమాల్లో నటించలేదు. ఇక దానికి ప్రధాన కారణం ఆయన ఎప్పటికీ వారి గుండెల్లో హీరోగానే ఉండాలని భావించారు. ఆ విధంగా శోభన్ బాబు చివరి వరకు హీరోగానే సినిమాలు చేశారు. ఇక అలాంటి శోభన్ బాబు సినిమా ఇండస్ట్రీకి 1996లో రిటైర్మెంట్ ఇచ్చారు. ఈయన రిటైర్మెంట్ ఇచ్చినప్పటి నుంచి ఏ సినిమాలో కూడా నటించలేదు.

కానీ రిటైర్మెంట్ ఇచ్చాక ఐదు సంవత్సరాల పాటు తనకి ఇష్టమైన కారులో మద్రాస్ చుట్టూ తన ఆస్తులను చూసుకుంటూ తనకు నచ్చిన పాటలను కారులో పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తిరిగే వారట. అంతేకాకుండా ఏదైనా సినిమా ఫంక్షన్లకు కూడా హాజరయ్యే వారు. అయితే అదే సమయంలో ఓ రోజు ఓ సినిమా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఓ హీరోయిన్ శోభన్ బాబు గారు మీ వయసు మీద పడిపోయింది ముసలివారు అయిపోతున్నారని అందట.

ఇక ఆ హీరోయిన్ చెప్పిన ఒకే ఒక మాటకి అప్పటినుంచి ఈ సోగ్గాడు బయటికి రావటమే మానేశారట. అంతేకాదు ఎంత అవసరం వచ్చినా కూడా ఇంట్లో నుంచి బయటకు కదిలే వారు కాదట. అలా ఆయన చనిపోయే వరకు కూడా ఇంట్లోనే ఉన్నారు. బయటకు వచ్చి ప్రజల్లో ఉన్న హీరో అనే గుర్తింపును పోగొట్టుకోకుండా ఉండడానికి తన ముస‌లి మొహాన్ని అభిమానిలకు చూపెట్టుకోలేక చివరి రోజుల్లో ఆయన ఆ హీరోయిన్ అన్న ఒకే ఒక మాట కారణంగా ఇంటి నుంచి బయటకు రాలేదట శోభన్ బాబు.