టాలీవుడ్‌లో ‘ దొంగలముఠా ‘ క్రియేట్ చేసిన ఇండ‌స్ట్రీ రికార్డ్ ఇదే… ఏ స్టార్ హీరో సినిమా బీట్ చేయ‌దుగా..!

ప్రస్తుత రోజుల్లో ఒక సినిమాను తీయాలంటే కోట్లలో ఖర్చు అవుతుంది. యంగ్ హీరోల సినిమాలకైతే మినిమం ప‌ది కోట్ల నుంచి పాతిక కోట్ల వరకు అవుతోంది. స్టార్ హీరోల సినిమాలకు దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. అలాగే మన టాలీవుడ్ లో వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే పైసా ఖర్చు లేకుండా తీసిన ఏకైక తెలుగు సినిమా ఒకటి ఉంది. అవును నమ్మశక్యంగా లేకపోయినా మీరు విన్నది నిజమే. ఎలాంటి ఖర్చు లేకుండా టాలీవుడ్ లో ఒక సినిమాను తీశారు.

అలాంటి ఘ‌న‌త సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు రామ్ గోపాల్ వ‌ర్మ‌. సంచలనాలకు మారు పేరాయ‌న‌. కాంట్రవర్సీలకు కింగ్. నిత్యం ఏదో వివాదం వ‌ర్మ చుట్టూ తిరుగుతునే ఉంటుంది. ప్రేక్ష‌కులు చూసినా, చూడ‌క‌పోయినా వ‌ర్మ మాత్రం త‌న‌కు న‌చ్చిన‌ట్లు మాత్ర‌మే సినిమాలు చేస్తుంటారు. కానీ, ఒక‌ప్పుడు ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. రాంగోపాల్ వర్మ అంటే ఒక పేరు కాదు.. బ్రాండ్ అన్న‌ట్లు ఉండేది.

‘శివ’ చిత్రంతో తెలుగు సినమా గతినే మార్చాడు. తెలుగు సినిమా చరిత్ర చెబితే శివ ముందు శివ తరువాత అనేంత స్థాయిలో పేరు గడించాడు. చేసే ప్రతీ పని చాలా క్రేజీగా ఉండాలనుకుంటారు రామ్ గోపాల్ వర్మ. ఇందులో భాగంగానే ఎన్నో ప్రయోగాలు చేశారు. సక్సెస్ మాత్రం కాలేదు. కానీ ఈయ‌న ‘దొంగల ముఠా’ సినిమా కోసం చేసిన ప్రయోగం మాత్రం సక్సెస్ అయ్యింది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో రవితేజ, చార్మీ కౌర్, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు, సుప్రీత్ రెడ్డి నటించారు. కేవలం ఏడుగురు సిబ్బందితో, ఐదే రోజుల సమయంలో చిత్రీకరించారు. ఈ సినిమా కోసం అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యలేదు. ఆర్టిస్టులు కూడా పైసా రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. సినిమాని తియ్యడానికి అవసరమైన కెమెరాలు, లైట్లు , మోనిటర్లు కూడా తన దగ్గర ఉన్న వాటినే వాడాడు రామ్ గోపాల్ వర్మ.

2011 మార్చి 18 న, షూటింగ్ ముగిసిన సరిగ్గా 33 రోజుల తరువాత, దొంగల ముఠా విడుదలై సంచ‌ల‌న విజయాన్ని న‌మోదు చేసింది. జీరో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 2 కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టింది. ఇక శాటిలైట్ రైట్స్ , డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్‌ వంటివి కలుపుకొని ఈ మూవీ రూ. 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌రిగింది. అలా బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బును అందరూ పంచుకున్నారు.

Tags: dongala mutta, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news, చార్మీ కౌర్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రవితేజ, లక్ష్మి మంచు, సుప్రీత్ రెడ్డి, సుబ్బరాజు