ఐదేళ్ల పాటు రిలేషన్ షిఫ్‌లో ఉన్న వ్య‌క్తితో అరియానా బ్రేక‌ప్‌… హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇది…!

బిగ్ బాస్ ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన బ్యూటీల‌లో అరియానా కూడా ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ మొద‌ట సీరియ‌ల్స్ న‌టించినా పెద్ద‌గా ఫోక‌స్ అవ్వ‌లేదు. కానీ ఆర్జీవీతో ఇంట‌ర్వ్యూ చేసింది. ఆ ఇంట‌ర్వ్యూలో అరియానా ఫిగ‌ర్ ను వ‌ర్మ ప్ర‌శంసించాడు. ఇక ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో యాంక‌ర్ గా కాస్త గుర్తింపు వ‌చ్చింది. ఆ వీడియో వైర‌ల్ అవ్వ‌డం వ‌ల్ల‌నే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ద‌క్కించుకుంది. ఇక బిగ్ బాస్ లో బోల్డ్ పాప‌గా గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర‌వాత చాలా టీవీ షోల‌లో సంద‌డి చేసింది.

ప్ర‌స్తుతం సినిమాలు టీవీ షోల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఓ ఇంట‌ర్వ్యూలో అరియానా త‌న జీవితంలో జ‌రిగిన ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించింది. అందులో త‌న ప్రేమ కథ కూడా ఒక‌టి. తొమ్మిదో త‌ర‌గ‌తిలోనే త‌న జీవితంలో ప్రేమ మొద‌ల‌య్యింద‌ని చెప్పింది. టెన్త్ కు వ‌చ్చేస‌రికి అది సీరియ‌స్ అయ్యింద‌ని పేర్కొంది. చిన్ననాటి నుండి తండ్రి లేక‌పోవ‌డం వ‌ల్ల ఎలా ఉండాలో త‌న‌కు తెలియ‌ద‌ని వ్యాఖ్యానించింది. అబ్బాయిల‌తో ఎలా ఉండాలో తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల అబ్బాయిల‌తో మాట్లాడ‌గానే ఆ కేరింగ్ నచ్చేద‌ని చెప్పింది.

త‌న బావ విజ‌య‌వాడ‌లో ఉంటే తాను తాండూర్ లో ఉండేదానిన‌ని చెప్పింది. త‌ర‌చూ ఫోన్ లో మాట్లాడుకునేవాళ్ల‌మ‌ని తిన్నావా..వ‌చ్చావా అంటూ త‌ను ఫోన్ లో అడ‌గ‌టం న‌చ్చేద‌ని ఇంట్లో ల‌వ్ అనేది లేద‌ని చెప్పింది. ఇక ఇంట‌ర్ లో బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని అప్పుడే మా బావ‌ది డిగ్రీ పూర్త‌య్యింద‌ని చెప్పింది. ఆ త‌ర‌వాత త‌న‌కు ఉద్యోగం వ‌చ్చింద‌ని మూడేళ్ల పాటూ క‌లిసి ఉన్నామ‌ని చెప్పింది. చాలా బాగా క‌లిసి ఉన్నామ‌ని కానీ ఎక్క‌డో బోర్ కొడుతుంద‌ని అంటారు.. కదా త‌న‌కు బోర్ కొట్టిందేమో అని చెప్పింది.

ఒక‌రోజు చూడ‌రానిది చూశాన‌ని చూశాన‌ని దాంతో హార్ట్ బ్రేక్ అయ్యింద‌ని చెప్పింది. అంతే కాకుండా త‌న‌కు ఆర్జే అవ్వాల‌ని ఉండేద‌ని దాంతో ఆర్జేగా ప‌నిచేశాన‌ని చెప్పింది. ఈ క్ర‌మంలో ఓ అబ్బాయితో ప‌రిచ‌యం ఏర్ప‌డ‌గా త‌న బావ‌కి అనుమానం వ‌చ్చింద‌ని చెప్పింది. ఆ త‌ర‌వాత ఇద్ద‌రం బ్రేక‌ప్ చెప్పుకున్నామ‌ని అరియానా అవేద‌న వ్య‌క్తం చేసింది.

Tags: anchor ariyana, ariyana, bigg boss beauty, film news, filmy updates, host ariyana, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news