నాగ‌బాబు చేసిన ఆ త్యాగం వ‌ల్లే చిరంజీవి నెం. 1 హీరో అయ్యాడా..?

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రైండ్ లేకపోయినా స్వయం కృషితో అంచలంచలుగా ఎదిగారు. ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఫైనల్ గా టాలీవుడ్ లో టాప్‌ హీరోల్లో ఒకడిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయ‌న స్థాపించిన మెగా సామ్రాజ్యం నుంచి ఎంద‌రో హీరోలు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఇండ‌స్ట్రీలో సూప‌ర్ స‌క్సెస్ అయ్యారు. ఒక్క నాగ‌బాబు త‌ప్ప‌. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. చిరంజీవి నెం. 1 హీరో అయ్యాడు అంటే అందుకు కార‌ణం ఆయ‌న త‌మ్ముడు నాగ‌బాబు చేసిన త్యాగ‌మే అట‌.

చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ‌బాబు.. `రాక్షసుడు` మూవీతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా.. అదృష్టం కలిసిరాదు. నటుడిగా మంచి మార్కులు వేయించుకున్నాడు. కానీ, హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. అయితే నాగబాబుని ఇండస్ట్రీ లో ఒక మాస్ హీరో గా నిలబెట్టడానికి చిరంజీవి సన్నాహాలు చేశార‌ట.

ఇందులో భాగంగానే త‌న‌కు ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు అందించిన ద‌ర్శ‌కుడు బాపినీడుతో నాగబాబు కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని చెప్పార‌ట‌. దాంతో ఆయ‌న `గ్యాంగ్ లీడర్` క‌థ‌ను నాగ‌బాబు రెడీ చేశారు. ఇటు నాగ‌బాబుతో పాటు అటు చిరంజీవికి కూడా గ్యాంగ్ లీడర్ క‌థ బాగా న‌చ్చేసింది. కానీ అంతకు ముందే చిరంజీవి బాపినీడు కోసం డేట్స్ ఇచ్చి ఉన్నాడు. ఆయన డేట్స్ సమీపిస్తున్నాయి.

అయితే బాపినీడు వ‌ద్ద గ్యాంగ్ లీడ‌ర్ క‌థ త‌ప్పితే.. మెగాస్టార్ కోసం సరిపడ కథ లేదు. అప్పుడే నాగబాబు నాకోసం రాసుకున్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమాని అన్నయ్య తో చెయ్యొచ్చు కదా, ఆయనకీ ఇంకా అద్భుతంగా ఈ సినిమా సెట్ అవుతుంది అన్నాడట. ఇక‌ నాగబాబే అలా చెప్పడం తో బాపినీడు చిరంజీవికి విష‌యం చెప్పాడ‌ట‌. మొద‌ట అందుకు చిరు ఒప్పుకోక‌పోయినా.. ఆ త‌ర్వాత ఎస్ చేయ‌క త‌ప్ప‌లేదు. చిరంజీవి డేట్స్ మొత్తాన్ని వినియోగించుకొని గ్యాంగ్ లీడర్ సినిమా తీసాడు బాపినీడు.

క‌ట్ చేస్తే గ్యాండ్ లీడ‌ర్ ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. అప్ప‌ట్లో ఈ సినిమా సృష్టించిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కాదు. వరుస హిట్స్ తో ఉన్న‌ చిరంజీవి ఖాతాలో ఇండస్ట్రీ హిట్ ప‌డ‌టంతో.. దెబ్బ‌కు ఆయ‌న టాలీవుడ్ లో నెం. 1 హీరోగా అవ‌త‌రించాడు. అలాగే ఆయ‌న మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి ఈ సినిమా విజయం ఎందో దోహ‌ద‌ప‌డింది. మొత్తానికి నాగ‌బాబు అలా గ్యాండ్ లీడ‌ర్ ను అన్న కోసం త్యాగం చేయ‌డంతో చిరంజీవి నెం. 1 హీరో అయ్యాడు.

Tags: chiranjeevi, film news, filmy updates, Gangleader, intresting news, latest news, latest viral news, Megastar, NagaBabu, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, Tollywood hero latest news, trendy news, viral news