శ‌ర‌త్‌బాబు హీరోగా చిరంజీవి విల‌న్‌గా చేసిన సినిమా ఇదే…!

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్‌బాబు ఇటీవ‌ల తీవ్ర అనారోగ్యంతో మృతిచెందారు. గ‌త కొంత కాలంగానే ఆయ‌న ప‌లు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మ‌ల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ కావ‌డంతో శ‌ర‌త్‌బాబు హైద‌రాబాద్‌లోని ఏఐజీ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతూ సోమ‌వారం మృతిచెందారు. ఒకప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించాడు. తెలుగు కన్నా ఈయనకు తమిళంలో ఎక్కువ గుర్తింపు వచ్చింది.

September 1981 Telugu Movies Release Date, Schedule & Calendar - Filmibeat

శ‌ర‌త్‌బాబు పుట్టింది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల‌వ‌ల‌స‌. పీయూసీ వ‌ర‌కు ఆముదాల‌వ‌ల‌స‌లోనే చ‌దివిన ఆయ‌న ఆ త‌ర్వాత శ్రీకాకుళంలో డిగ్రీ చ‌దివారు. ఆ త‌ర్వాత మిత్రులు, లెక్చ‌ర‌ర్స్‌, త‌ల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో త‌న అభిమాన ద‌ర్శ‌కుడు ఆదుర్తి సుబ్బారావుకు లేఖ రాయ‌డంతో పాటు ఒ ఫోటో కూడా పంపారు. అలా ఆయ‌న సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

 

శరత్ బాబు హీరోగా నటించిన ఒక సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి విలన్ రోల్ పోషించాడు. శరత్ బాబు హీరోగా పరిచయమైన కొత్తలోనే చిరంజీవి ఇండస్ట్రీ లోకి రావడంతో శరత్ బాబు నటించిన 47 రోజులు అనే సినిమాలో చిరంజీవి విల‌న్ రోల్లో నటించి అందర్నీ మెప్పించాడు. శరత్ బాబుకు పాజిటివ్ రోల్ లో ఎంత గుర్తింపు వచ్చిందో.. చిరంజీవికి నెగిటివ్ రోల్ కూడా అంతే మంచి గుర్తింపు వచ్చింది.

 

ఈసినిమాలో ఈ ఇద్దరు హీరోల‌ నటన తారాస్థాయిలో ఉంది. అయితే చాలా సినిమాల్లో నటించిన శరత్ బాబు చివరిగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో బార్ కౌన్సిల్ హెడ్ గా కనిపించారు. ఇక న‌రేష్‌, ప‌విత్రా లోకేష్ క‌లిసి న‌టిస్తోన్న మ‌ళ్లీపెళ్లి సినిమాలోనూ శ‌ర‌త్‌బాబు ఓ పాత్ర‌లో క‌నిపించారు. ఈ సినిమా ఈ నెల 26న రిలీజ్ అవుతోంది.