ర‌మాప్ర‌భ – శ‌ర‌త్‌బాబు మ‌ధ్య ఇంత య‌వ్వారం న‌డిచిందా… అన్ని కోట్ల ఆస్తి ఇచ్చిది నిజ‌మేనా ?

సీనియర్ యాక్ట‌ర్ శరత్ బాబు సోమ‌వారం అనారోగ్యంతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. శరత్ బాబు మల్టీ ఆర్గాన్స్‌ పూర్తిగా డ్యామేజ్ కావడంతో సోమవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. శరత్ బాబు తెలుగు వ్యక్తి అయినా కూడా తెలుగుతో పాటు తమిళం, కన్నడ‌, హిందీ, ఇలా చాలా భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శరత్‌బాబు హీరో పాత్రలోనే కాక‌.. విలన్‌గా.. ఆర్టిస్ట్ గా కూడా మెప్పించాడు. నటనా జీవితంలో ఎంతగానో సక్సెస్ అయిన శరత్‌బాబు వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి.

తన పర్సనల్ లైఫ్ లో రెండు పెళ్లిళ్లు చేసుకున్న శరత్ బాబు ఏవో మనస్పర్ధలు కారణంగా వారితో విడాకులు తీసుకున్నాడు. అయితే తనకంటే ఏడేళ్లు పెద్దదైన సీనియ‌ర్ నటీమ‌ణి రమాప్రభను.. శరత్ బాబు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రమాప్రభ హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి కోట్లల్లో ఆస్తులను కూడబెట్టుకుంది. శరత్ బాబు మాత్రం వయసులో త‌న‌కంటే ర‌మాప్రభ‌ ఏడేళ్లు పెద్దదైనా ఆస్తి కోసమే ఆమెను పెళ్లి చేసుకున్నాడంటూ అనేక వార్తలు వచ్చాయి.

రత్ బాబు గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. రమాప్రభ ఆస్తి నేను తీసుకున్నానని అందరూ నన్ను విమర్శిస్తారు.. కానీ రమాప్రభకు నేను 60 కోట్ల రూపాయల ఆస్తిని రాసిచ్చాను.. అప్పట్లో నా ఆస్తులు అమ్మి రమప్రభకు ఒక ప్రాపర్టీ, తన తమ్ముడి పేరు మీద ఒక ప్రాపర్టీ, అలాగే వారిద్దరి పేరు మీద మరో ప్రాపర్టీ కొనుగోలు చేశానని.. స్వయంగా తానే చెప్పారు.

Puri Jagannadh's Undisclosed Love to Rama Prabha

తన 22 ఏళ్ళ వయసులో కాలేజీ నుంచి డైరెక్ట్ గా ఇండస్ట్రీకి వచ్చాన‌ని… ప్రపంచం గురించి తెలియని వయసులో రమాప్రభ తనకు పరిచయం అయిందని.. ఆ వయసులో ఎలాంటి అనుభవం లేక నేను నాకంటే ఏడేళ్లు పెద్దదైన రమప్రభని పెళ్లి చేసుకొని తప్పు చేశానంటూ శరత్ బాబు కామెంట్ చేశారు.