కష్టకాలం వచ్చినప్పుడు ధైర్యంగా కష్టాలను ఎదుర్కోవటంలో నారా, నందమూరి కుటుంబాలు ఎప్పుడు మనోధైర్యంతోనే ఉంటాయి. గతంలో కొన్ని కుటుంబాలలో కల్లోలం జరిగినప్పుడు కుటుంబం అంతా రోడ్లమీదకు వచ్చి అన్యాయం జరిగిందని దొంగ కన్నీళ్లు.. దొంగ ఏడుపులు మాయమాటలతో ప్రజలను నమ్మించారు. మొత్తం తల్లి, చెల్లి, పెళ్ళాం, బావ అందరూ రోడ్లెక్కారు. అదంతా కేవలం అధికారం కోసం అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోనీ వాళ్ళ పోరాటంలో నిజాయితీ ఉందనుకుంటే ఈరోజు వాళ్లంతా ఎవరి కోసం ? పోరాటం చేశారో సదర వ్యక్తి వెనకాల లేరు.
అంటే సొంత కుటుంబ సభ్యులే సదరు వ్యక్తిని నమ్మే పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చేందుకు వారంతా ఘూడుపుటాని ఆట ఆడారు. ఇప్పుడు అధికారం వచ్చిన వెంటనే తల్లి, చెల్లి ఎక్కడకు పోయారో తెలియదు. కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా… నందమూరి ఫ్యామిలీ ఎప్పుడూ అధికారం, అవకాశం కోసం అర్రులు చాచలేదు. కుటుంబం అంతా ఒక్క తాటిమీదే ఉంది.
గతంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ పై వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ అసభ్య పదజాలంతో విమర్శలు చేసినప్పుడు నందమూరి – నారా కుటుంబాలు ఒకటయ్యాయి. కలిసి ప్రెస్ మీట్ పెట్టాయి. అలాంటి చర్యలను ముక్తకంఠంతో ఖండించాయి. ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏనాడు నందమూరి కుటుంబ సభ్యులు కనీసం పరిపాలనలో జోక్యం చేసుకోలేదు. చిన్న చిన్న లబ్ది కూడా పొందలేదు. వారి నిజాయితీకి అది నిలువెత్తు నిదర్శనం. తండ్రి అధికారం పేరు చెప్పుకొని ఆస్తులు పోగేసుకున్నది కూడా లేదు.
ఇక చంద్రబాబు అరెస్టు విషయానికి వస్తే తక్షణమే ఆయన చూడటానికి పాదయాత్రలో ఉన్న లోకేష్ తో పాటు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి తో పాటు బాలయ్య కూడా వచ్చారు. ఇటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా మీడియా ముఖంగానో లేదా సోషల్ మీడియాలో స్పందించడం చేస్తున్నారు. వీరు ఎవరు దొంగ ఏడుపులు.. దొంగ కన్నీళ్లు పెట్టుకోవడం లేదు తమ కుటుంబ సభ్యులకి మద్దతుగా ధైర్యం చెబుతున్నారు. రేపు అధికారం వస్తే సంపాదించుకోవాలన్న ఆశలు ఉన్నోళ్లు కాదు.. దీనిని బట్టే నందమూరి, నారా కుటుంబాలకు ఆ కుటుంబాలకు తేడా ఏంటో తెలుగు ప్రజలే తెలుసుకోవాల్సిన సమయం ఇది..!