చంద్ర‌బాబు వేరు… లోకేష్ వేరు… జ‌గ‌న్ గుర్తు పెట్టుకో… నిన్ను వ‌దిలి పెట్ట‌డంతే…!

ఒకటి మాత్రం నిజం చంద్రబాబు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. రిస్క్‌ చేసేందుకు చంద్రబాబు ఇష్టపడరు. ప్రతి విషయంలోనూ గొడవలుకు పంతాలకు పట్టింపులకు పోయే మనిషి కాదు. అటువైపు నుంచి అనవసరపు విమర్శలకు వచ్చినా కౌంటర్ ఇవ్వాలన్న ఆసక్తి కూడా చంద్రబాబుకు ఉండదు. ఆయనకు తెలిసింది అలా ఒక్కటే పని పని పని పని.. అభివృద్ధి.. భవిష్యత్తు రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఇవే ఆయన ఆశయాలు, లక్ష్యాలుగా కనబడుతూ ఉంటాయి.

అయితే ఇప్పటి రాజకీయాల్లో అవన్నీ పోయాయి. పంతాలు, ప్రతీకారాలు, కుల రాజకీయాలు, ప్రజలను రెచ్చగొట్టడం ఇవే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చూస్తున్న భారతీయులు అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకప్పుడు తమిళనాడు తరహాలో ఉన్న రాజకీయాలను మించి ఇప్పటి అధికారపక్షం కేవలం ప్రతీకారమే ధ్యేయంగా రాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఒకటి మాత్రం నిజం చంద్రబాబు వేరు.. ఆయన తనయుడు లోకేష్ వేరు. మహాత్మా గాంధీ నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలన్న రోజులు పోయాయి. లోకేష్ అలా కాదు జగన్ ఎంత రివేంజ్ రాజకీయం చేస్తున్నాడో ? అంతకు అంత బదులు తీర్చేస్తానని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించారు. తాజాగా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన లోకేష్ ముందుగా బంద్‌కు మద్దతు ప్రకటించిన వారికి.. విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. టిడిపి తలపెట్టిన బందుకు సహకరించిన ప్రజలకు, పవన్ కళ్యాణ్ అన్నకు.. మందకృష్ణ మాదిగ గారికి.. కమ్యూనిస్టులకు కృతజ్ఞతలు చెప్పిన లోకేష్ జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు అరెస్టు అన్నారు.

ఈ తప్పులకు పర్యవసనాలు జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా అనుభవిస్తారని లోకేష్ చెప్పకనే చెప్పారు. పాము తలలో విషం జగన్కు ఒళ్ళంతా విషం ఉందని ఎద్దేవా చేశారు. జగన్ దృష్టిలో అధికారం అంటే వేధింపులు.. కక్ష తీర్చుకోవటం మాత్రమే అని.. జగన్ పై 38 కేసులు ఉన్నాయి.. బాబాయి హత్య కేసు.. పింక్ డైమండ్ కేసు.. కోడి కత్తి కేసుల్లో ఎంత నిజమందో చంద్రబాబుపై పెట్టిన కేసులో కూడా అంతే నిజం ఉందని అన్నారు. ఈ కేసు వల్ల జగన్ ఎంత సైకోలో ప్రజలకు రుజువైందని లోకేష్ చెప్పారు. సిఐడి అనేది కక్ష సాధింపు డిపార్ట్మెంట్గా మారిపోయింది అన్న లోకేష్ తనపై 20కి పైగా కేసులు పెట్టారు.. హత్యాయత్నం చేసుకోవడం పెట్టారు.. నేను భయపడను జగన్ ను వదిలిపెట్టనని క్లియర్ కట్ గా చెప్పేశారు.

ఏది ఏమైనా ఇప్పటికే లోకేష్ ప్రత్యేకంగా రెడ్‌బుక్ పెట్టుకుని మరి పాదయాత్రలో ఎక్కడ ఎవరు అరాచకాలు చేశారో అవన్నీ నోట్ చేసుకుంటూ వస్తున్నారు. రేపు అధికారంలోకి రాగానే కచ్చితంగా అంతకు అంత బదులు తీర్చేస్తామని చెబుతున్నారు. తమ లక్ష్యం అభివృద్ధి, భవిష్యత్తు ఇలా కాకుండా తమ పార్టీ నేతలను వేధిస్తూ పగలు ప్రతీకారంగా మాత్రమే రాజకీయాలు చేసే వారిని ఏమాత్రం వదిలిపెట్టను అని లోకేష్ క్లియర్ కట్ గా చెప్పేశారు. రేపు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పటివరకు ఒకలా సాగిన టిడిపి రాజకీయం రేపు లోకేష్ ఆధ్వర్యంలో సరికొత్తగా సాగుతుందన్నది అయితే క్లారిటీ వచ్చేసింది. లోకేష్ తో ఆట అయితే జగన్‌కు మామూలుగా ఉండదు.