ఏ -1 కి ఏ – 37 మధ్య 36 మంది… క‌క్ష‌తోనే చేశారుగా .. ఇదే ప‌క్కా సాక్ష్యం…!

చంద్రబాబు ఏ వన్ అని విస్తృతంగా ప్రచారం చేశారు. సాక్షిలో బ్యానర్.. అదే టీవీ9 లో కూడా అదే ఎన్టీవీ లోను అదే వార్త బాగా హైలెట్ చేశారు. నీలి కూలి వ‌ర్గాల సోషల్ మీడియాలను అదే వార్త వైరల్ అయింది. సిఐడి కూడా ప్రధాన నిందితుడు అనే చెప్పారు.. చివరికి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు జాబితాలో ఏ వన్ అని లేదు ఏ 37 అని ఉంది. కానీ రిమాండ్ రిపోర్టు కన్నా తాము చెప్పిందే నిజం అన్నట్టుగా నీలి, కూలి మీడియా చెలరేగిపోయింది.

రిమాండ్ రిపోర్టులో ఏ 37 అని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఏ వన్ అంటూ సాక్షి మీడియా కంటే మిగిలిన రెండు కూలీ మీడియాలు బాగా ప్రచారం చేశాయి. వారు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఇలా ప్రచారం చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ నీలి, కూలి మీడియా ఛానల్స్ కు రిపోర్టర్లు వేరు అయినా వాళ్ళ సూపర్ ఎడిటర్ మాత్రం తాడేపల్లిలో సలహాదారుగా ఉంటాడన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక్కడ రిపోర్టర్లు కొట్టుకున్న ఆయన దగ్గరే పంచాయతీకి పోతారు. ఆయనే ఇప్పుడు ఈ నీలి, కూలి మీడియా ఛానల్స్ కు ఎడిటర్గా ఉంటున్నారని.. ఆయన సూచనల ప్రకారమే ఈ మానిప్యులేషన అంతా నడుస్తుందన్న ప్రచారం మీడియా వర్గాల్లో ఉంది. విచిత్రం ఏంటంటే సిఐడి రిమాండ్ రిపోర్టు గురించి ఈ చానల్స్ చెబుతున్నా… చంద్రబాబు తర‌పు లాయర్ల వాద‌న గురించి.. ఆయన లేవనెత్తిన‌ అంశాల గురించి చెప్పటానికి వారికి మనసు రాలేదు.

ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం పూర్తిగా వ్యక్తిగత కక్షాల వైపు మారిపోయింది. ఈరోజు పవర్ వారి వైపు ఉంది. రేపు పవర్ టిడిపి చేతుల్లోకి వస్తే టిడిపి నేతలు కూడా వ్యక్తిగతంగానే ఎందుకు ?తీసుకోకూడదు అన్న ప్రశ్నలు అయితే ఉత్తమవుతున్నాయి. అప్పుడు ఈ కూలీ నీలి మీడియా సంస్థలకు పోటీ సంస్థల నుంచి ఇతర మీడియా సంస్థల నుంచి కనీసం సానుభూతి కూడా రాద‌న్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.