పవర్ స్టార్ మిస్ చేసుకున్న.. రాజమౌళి సూపర్ హిట్ సినిమా ఇదే..!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ నలుమూలకు చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. రాజమౌళితో సినిమా చేయాలని భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో కొంతమంది అగ్ర హీరోలతో సినిమా చేయాలని ట్రై చేశాడు.

Pawan Kalyan aiming to emerge as a force in AP politics?

 

అందులో ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ పవర్ ఫుల్ యాక్షన్ సినిమా తీయాలని పవర్ స్టార్ కోసం విక్రమార్కుడు కథను రెడీ చేశాడు. ఈ కథ పవన్ కళ్యాణ్ కు చెప్పడానికి రాజమౌళి ఎంతో ట్రై చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ ఆ టైమ్‌లో రెండు సంవత్సరాల వరకు బిజీగా బిజీ గా ఉంటాడని తెలుసుకొని… చేసేదేమీ లేక ఇదే కథతో మాస్ మహారాజా రవితేజతో విక్రమార్కుడు సినిమా తీశాడు.

ఈ సినిమాతో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు రాజమౌళి. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ కెరీర్ మ‌రో ప‌దేళ్ల పాటు వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఇదే సినిమా పవన్, రాజమౌళి కాంబోలో వచ్చి ఉంటే ఇండస్ట్రీ షేక్ అయిపోయేది అని చెప్పవచ్చు. ఇప్పటికీ కూడా ఈ కాంబినేషన్లో ఓ సినిమా రావాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Vikramarkudu - Disney+ Hotstar

 

ప్రస్తుతం రాజమౌళి తన తర్వాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ తో ప్రకటించాడు. ఈ సినిమాను పాన్ ఓల్డ్ అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కుతుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా కథ కూడా ఇప్పటికే పూర్తి చేయగా. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుందని తెలుస్తుంది.