న‌రేష్‌తో ఎఫైర్‌ మ్యాట‌ర్‌లోకి మ‌హేష్‌ను లాగ‌డం వెన‌క ప‌విత్ర వేసిన బిగ్ స్కెచ్ ఇదే..!

సీనియర్ హీరో నరేష్ – పవిత్ర లోకేష్ ప్రేమాయణం అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు ఎప్పటినుంచో కలిసి ఉంటున్నారు. నాలుగేళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తోన్న ఈ జంట త్వ‌ర‌లోనే భార్య‌భ‌ర్త‌లు కాబోతున్నారు. దీనిపై న‌రేష్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. తన మూడో భార్య ర‌మ్య ర‌ఘుప‌తికి విడాకులు ఇచ్చి త్వరలోనే పవిత్ర లోకేష్ ని పెళ్లాడుతానని చెప్పేశారు. అయితే వీరిద్ద‌రి రిలేష‌న్ షిఫ్‌తో పాటు వీరు క‌లిసి న‌టిస్తోన్న మ‌ళ్లీ పెళ్లి సినిమాపై ఇప్పుడు మీడియా ఫోక‌స్ బాగా ఉంది.

Naresh Babu Wiki, Age, Girlfriend, Wife, Family, Biography & More - WikiBio

అయితే గ‌త రాత్రి జ‌రిగిన ఈ సినిమా ప్రి రీలీజ్ ఈవెంట్ ఫంక్ష‌న్లో ఈ ఇష్యూలోకి అనూహ్యంగా మ‌హేష్‌బాబును కూడా తీసుకువ‌చ్చారు ప‌విత్రా, న‌రేష్ ఇద్ద‌రూ..! న‌రేష్ అయితే మ‌హేష్‌బాబు కూడా త‌మ రిలేష‌న్‌ను యాక్సెఫ్ట్ చేశార‌ని బాంబు పేల్చాడు. ఇక సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, మ‌హేష్ ఫ్యాన్స్ కూడా త‌మ‌ను ఆశీర్వ‌దించారంటూ వాళ్ల‌ను కూడా త‌మ రిలేష‌న్‌షిఫ్ ఇష్యూలోకి లాగేశాడు.

ఉన్న‌ట్టుండి మ‌హేష్‌ను కూడా త‌మ రిలేష‌న్‌లోకి ఎందుకు ? లాగారు ? అన్న‌ది ఎవ్వ‌రికి అర్థం కాలేదు. ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం న‌రేష్ పెళ్లిళ్లు.. ఈ వ‌య‌స్సులో ప‌విత్రాతో స‌హ‌జీవ‌నం ప‌ట్ల మ‌హేష్‌, సూప‌ర్‌స్టార్ కృష్ణ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. న‌రేష్ ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ ప‌రువు, ఇటు మ‌హేష్ ప‌రువు అడ్డంగా తీసేస్తున్నాడంటూ తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

Actor Naresh Gets Into An Ugly Fight With Ex-Wife Who Tried to Attack  Pavithra Lokesh! - Filmibeat

ఈ క్ర‌మంలోనే ఈ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి నెగిటివ్ ట్రోల్స్ రాకుండా ముందుగానే మహేష్ కూడా మా రిలేషన్ కి ఓకే చెప్పాడంటూ ఇద్ద‌రూ కవర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగానే ఉంది. న‌రేష్ పెద్ద బిగ్ స్కెచ్ వేసే ఈ ఇష్యూలోకి మ‌హేష్‌ను లాగేశాడు.