ఆ దుష్ట శ‌క్తులే న‌న్ను ఇబ్బంది పెట్టాయి… ఘాటుగా రెచ్చిపోయిన ప‌విత్రా లోకేష్‌..!

సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ కలిసిన నటిస్తున్న మళ్లీ పెళ్లి సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి.. వీరిద్దరి గురించే వార్తలు వస్తున్నాయి. నరేష్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో నరేష్ పవిత్ర లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో సంచలనంగా మారాయి.

Naresh is 'getting married soon' with Pavitra Lokesh, kisses her in new  video - Hindustan Times

ముందుగా నరేష్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే నాకు మేకప్ వాసన అంటే ఇష్టం. తాను 9వ సంవత్సరంలో ఉండగా పండంటి కాపురం సినిమాతో అనుకోకుండా నా సినిమా ప్రయాణం ప్రారంభమైంది.. తొలిసారిగా మేకప్ వేసుకున్న క్షణాలను తాను ఎప్పటికీ మరిచిపోలేన‌ని చెప్పాడు. ఇక పవిత్ర మాట్లాడుతూ నేను కొత్త జీవితం ప్రారంభిస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి. ప్రతి మనిషికి కొన్ని కలలు ఉంటాయి.. వాటిని నెరవేర్చుకునేందుకే తాను సినిమాల్లోకి వచ్చానని.. ఒంటరిగానే నా జీవితాన్ని బిల్డ్ చేసుకున్నట్టు చెప్పారు.

అయితే నా అనుమతి లేకుండా కొన్ని దుష్టశక్తులు దాన్ని బ్రేక్ చేశాయని.. దానికి తగ్గట్టుగానే నేను చేశానని పవిత్ర చెప్పారు. అయితే ఆ దుష్టశక్తులకు నరేష్ గారు నా వెనకాల ఉన్నారన్న విషయం తెలీదు.. మళ్ళీ ఎదిగేందుకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు.. కుటుంబంతో పాటు కృష్ణ గారు, మహేష్ బాబు అభిమానులంతా నన్ను అంగీకరించారు అంటూ పవిత్ర ఆనందం వ్యక్తం చేసింది.

Naresh Pavitra Lokesh Marriage Announcement | Pavithra Lokesh Relationship  Wedding Latest Video - YouTube

ఇక పవిత్ర లోకేష్ దుష్టశక్తులు అనే పదం వాడటం వెనక నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిని ఉద్దేశించి తన మాజీ భర్త సుచేంద్రను ఉద్దేశించే చేసిందా ? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఏది ఏమైనా నరేష్ పవిత్ర పెళ్లి జరిగే వరకు పెద్ద రచ్చ జరిగేలా ఉంది.