బాలయ్య ‘ భగవంత్ కేసరి ‘ క‌థ‌పై అనిల్ రావిపూడి ఇచ్చిన అదిరే ట్విస్ట్ ఇది…!

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ హిట్‌ల‌తో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలైన బాలయ్య విజయ యాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో మరో లెవెల్ కు వెళ్ళింది. ఇక ప్రస్తుతం తన 108వ‌ సినిమా భగవంత్‌ కేసరిను టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో చేస్తున్నాడు. ఇక అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ప్రేక్షకులను ఎంతో మెప్పించింది.

ఇక అంతేకాకుండా బాలయ్య లుక్‌ కూడా చాలా కొత్తగా ఉంది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల‌ ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయంపై కన్నేసాడు బాల‌య్య‌. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడితో బాలకృష్ణ ఐదేళ్ల క్రితమే సినిమా చేయాల్సి ఉన్నా అది కుదరలేదు. అనిల్ రావిపూడి గతంలోనే బాలయ్యతో 100వ‌ సినిమా చేయాలనుకున్నారు. అదే సమయంలో రామారావు గారు అనే టైటిల్ తో బాలయ్య కోసం ఓ పవర్ఫుల్ కథను కూడా రాసుకున్నారు అనిల్‌.

అయితే 100వ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఒక ప్రయోగాత్మక సినిమా అయ్యుండాలని క్రిష్ దర్శకత్వంలో గౌతమిపుత్ర శాతకర్ణి చేశారు బాలయ్య. ఆ తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేసే టైం కుదరలేదు. ఇక లేటెస్ట్ గా బాలకృష్ణ 108వ సినిమాగా ఈ కాంబో కలిసి సినిమా చేస్తుంది. అయితే అప్పుడు అనుకున్న రామారావు కథనే అనిల్ రావిపుడి ఇప్పుడు చేస్తున్నాడని కొందరు అనుకున్నారు కానీ అందులో వాస్తవం లేదట‌.

ఇప్పుడు రామారావు కథ బాగున్నా.. ఇప్పటికే అదే టైటిల్ తో రవితేజ ఓ సినిమా చేశాడు. మళ్లీ ఇదే పేరు తో సినిమా చేస్తే బాగోదని భావించిన అనిల్ రావిపూడి బాలయ్య కోసం మరో కొత్త కథ భగవంత్ కేసరి రాసుకున్నారట. ఈ సినిమా బాలయ్య మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఉంటూనే అనిల్ రావిపుడి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా కూడా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇలా బాలయ్య ఈ సినిమాలో మాస్ ఆడియోస్ కి ఫుల్ మీల్స్ ఇవ్వటం పక్కా అని ఫిక్స్ అవ్వాల్సిందే..!