టాలీవుడ్‌ను నిండా ముంచేసిన హీరోలు వీళ్లే… ఆశ‌లు అడియాస‌లు చేసేశారు..!

చిత్ర పరిశ్రమకు సంక్రాంతి, దసరా సీజన్ తర్వాత సమ్మర్ సీజన్ అంటే ఎంతో క్రేజ్‌ ఉంటుంది. ఈ సీజన్లో స్టార్ హీరోలు అందరూ తమ సినిమాలను ప్రేక్షకులు ముందు తీసుకురావడానికి రెడీ అవుతారు. వేసవి సెలవుల్లో వేడి నుంచి ఉపశమనం పొందడానికి సినిమాలు చూడడానికి ఆడియన్స్ ఎగబడతారు. అలాంటి సమ్మర్ సీజన్లో వరుసగా సినిమాలు వస్తుంటే.. అసలు వచ్చిన వాటికి థియేటర్లు సరిపోతాయా లేదా అనే అనుమానాలు ఉండేవి.. కానీ ఈ సమ్మర్ సీజన్లో అసలు స‌రైన హిట్‌ సినిమాలే లేక థియేటర్లు కళ తప్పాయి.

Agent: Akhil Akkineni promises action like never before in the new birthday  poster ahead of the grand release | PINKVILLA

సాధారణంగా సమ్మర్ సీజన్ ఎప్పుడూ కళకళలాడుతుంది.. ఈసారి కూడా అందరూ అదే ఊహించారు.. దానికి అనుగుణంగా సమ్మర్ మొదటిలోనే వచ్చిన దసరా సినిమా బంపర్ హిట్ కొట్టింది.. ఈ సినిమాతో సమ్మర్ తిరుగులేదని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన రావణాసుర, శాకుంతలం సినిమాలు ఒక్కసారిగా అందరి ఆశలన్నీ అడియాసలు చేశాయి. విరూపాక్ష మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి అందరికీ మళ్లీ బూస్ట్ ఆప్‌ ఇచ్చింది. ఇప్పటికీ థియేటర్లో ఈ సినిమానే నడుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Rama Banam (2023) - IMDb

ఈ సినిమా తర్వాత వచ్చిన ఏజెంట్ ఎవరు ఊహించని డిజాస్టర్. కనీసం ఏడు కోట్ల కలెక్షన్లు కూడా రాబట్లేకపోయింది. ఈ సినిమా తర్వాత వచ్చిన రామబాణం, ఉగ్రం సినిమాల పరిస్థితి కూడా ఇంతే. వీటి కలెక్షన్లు కనీసం ఐదు కోట్ల కూడా మించలేదు. మరోవైపు రీసెంట్ గా వచ్చిన కస్టడీ సినిమా పరిస్థితి కూడా మరీ దారుణంగా ఉంది. ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా తొలి వారంలో కూడా కనీసం ఐదు కోట్ల షేర్ కూడా రాలేదు.

Custody Trailer (Telugu) | Naga Chaitanya | Krithi Shetty | Yuvan Shankar  Raja | Venkat Prabhu - YouTube

దీంతో థియేటర్స్ అన్ని వెలవెలబోతున్నాయి. జూన్ 16న ఆదిపురుష్ వచ్చేవరకు పరిస్థితి ఇంతేనేమో..? ఇప్పటికీ చాలా థియేటర్లో ఆప్షన్ లేక విరూపాక్ష సినిమానే రన్ చేస్తున్నారు. మరో ఈ నెల రోజులు చిత్ర పరిశ్రమకు గడ్డు కాలమనే చెప్పాలి. రానున్న 30 రోజుల్లో అన్నీ మంచి శకునములే, బిచ్చగాడు 2, సామజవరగమనా, మేం ఫేమస్, మళ్లీ పెళ్లి లాంటి సినిమాలు రానున్నాయి. వాటితో థియేటర్లు క‌ళ‌క‌ళ‌లాడుతాయేమో చూడాలి.

Ravi Teja Ravanasura Movie HD Wallpaper | Moviegalleri.net

Tags: films updates, latest news, latest updates, movie updates, popular news, social media, star actor, Star hero, telugu news, trendy news, viral news