ప్రభాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ వ‌దులుకున్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌… ఆ సినిమా ఇదే…!

స్టైలిష్ యాక్షన్ సినిమాలకే ప్రస్తుతం ఎంతో క్రేజ్‌ ఉంది. దీనికి ఉదాహరణ బాలీవుడ్ లో షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్. ఈ సినిమాలో పెద్దగా స్టోరీ ఏమీ లేకపోయినా యాక్షన్ జోనర్ అనే కారణంతో సినిమాను జనాలు ఎగ‌బడి మరీ చూశారు.. దానికి ఫలితంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. తెలుగులో కూడా ఈ జోనర్ సినిమాలకు చాలా క్రేజ్ ఉంది. కానీ ఒకప్పుడు ఈ సినిమాలకు ఇంత క్రేజ్‌ ఉండేది కాదు. కేవలం కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు మాత్రమే బాగా చూసేవారు.

Billa (2009) (Telugu) - Box Office Collection, Budget & Reviews

ఆ సినిమాల ట్రెండ్ నడుస్తున్న సమయంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన బిల్లా సినిమా వచ్చింది. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమాకి అప్పట్లో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా యావ‌రేజ్ అయ్యింది. ఇందుకు కార‌ణం ఈ సినిమాకు ప్ర‌భాస్ మార్కెట్‌కు మించి బ‌డ్జెట్ పెట్టారు. అప్ప‌టికే త‌మిళంలో విష్ణువ‌ర్థ‌న్ డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ హీరోగా వ‌చ్చి తెర‌కెక్కిన బిల్లాను తెలుగులో రీమేక్ చేశారు.

Billa : Prabhas, Anushka Shetty, Namitha: Amazon.in: Music}

హాలీవుడ్ రేంజ్ లో ప్రభాస్ అద్భుతమైన స్టైలిష్ లుక్స్ – నటన ఈ సినిమాని ఇప్పటికీ చూసేలా చేస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశాడు. ఈ సినిమా స్టోరీని ప్రభాస్ కంటే ముందు మెహార్‌ రమేష్ ఎన్టీఆర్ కి చెప్పాడట.. ఎన్టీఆర్ కి కథ నచ్చింది కానీ.. ఈ సినిమా నాకంటే ప్రభాస్‌కి బాగా సూట్ అవుతుంది… అతనితో నువ్వు ఈ సినిమా చేయి మనం మరో సినిమా చేద్దామని అన్నారట.

Watch Kantri on ott streaming online

అలా ఈ క్లాసిక్ చిత్రం ఎన్టీఆర్ చేతి నుంచి జారీ ప్రభాస్ చేతికి వెళ్ళింది. అప్పట్లో ఈ సినిమా 14 కోట్ల రూపాయిల రేంజ్ షేర్ వసూళ్లను రాబట్టింది. అప్పటికి ఇది ప్రభాస్ కెరీర్ లో ఆల్ టైం టాప్ 3 గ్రాసర్ గా నిలిచింది. ఆ త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ ఎన్టీఆర్‌తో కంత్రి, శ‌క్తి సినిమాలు తెర‌కెక్కించారు.