గ్లామ‌ర్‌తో క‌వ్వించే ఈ స్టార్ హీరోయిన్ ఇలా అయ్యిందేంటి… ఎవ‌రో గుర్తుప‌ట్టారా..!

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలామంది స్టార్ హీరోయిన్స్ గ్లామర్ ఫోటోషూట్స్ తో సందడి చేస్తూనే ఉంటారు. వారు ఇన్‌స్టాలో తమ ఫొటోస్ ని షేర్ చేయడం ఆలస్యం అభిమానులు కూడా ఆపోస్ట్‌ల‌ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అలా ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోయే హీరోయిన్‌ల‌లో ఆ పై ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ ఒకటి ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..?
ఆమె ఎవరో కాదు పట్టం పోలే అనే మలయాళం మూవీ తో ఇండస్ట్రీలోకి 2013లో ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహన్.

కేరళ కు చెందిన ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కన్నడ, హిందీ మరియు తమిళ మూవీలో నటించింది. 2019లో రజనీకాంత్ పెట్టాలో నటించడం ఈమె జీవితాన్ని మంచి మలుపు తిప్పింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించిన మాళవిక మోహన్ కు విజయ్‌ దళపతి మాస్టర్, ధనుష్ మారన్‌ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఈ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద అంతంత మాత్రంగా ఆడినప్పటికీ వీటి ద్వారా మంచి గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీ లో హీరోయిన్గా నటించబోతుందట. చియాన్‌ విక్రమ్ తంగాలన్ లోను ఈమె హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం పైన కనిపిస్తున్న ఫోటోల్లో గుర్తుపట్టలేనంతగా మారిపోయి క‌నిపించింది. ఒంటిపై పచ్చబొట్లు, చేతిలో ఆయుధం, మెడ.. నడుము, తల చుట్టూ తాళ్లతో డెకరేట్ చేసుకుని పీరియాడికల్ కథతో తెర్కెక్కిస్తున్న ఓ సినిమాలో మాళవిక హారతి అనే పాత్రలో కనిపిస్తుంది. ఎప్పుడు అందంగా గ్లామరస్ రోల్స్‌లో కనిపించే ఈ పిల్ల లేటెస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది.

Happy birthday Aarathi💥💥@MalavikaM_ stay happy😃💥 ⁦@officialneelam⁩ ⁦@StudioGreen2#HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/rxnANnGzbb

— pa.ranjith (@beemji) August 4, 2023