ల‌వ‌ర్‌తో అడ్డంగా దొరికేసిన మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్‌… ఈ వ‌య‌సులో మ‌ళ్లీ పెళ్లా..!

ఇటీవల మాజీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ లారెన్స్ శాంచేజ్, అమెజాన్ వ్యవస్థాపకుడు ఎంగేజ్మెంట్ జెఫ్ బోనస్ ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎంగేజ్మెంట్ కి మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కులు బిల్‌గేట్స్‌తో పాటు ఆయ‌న‌ ప్రియురాలు ఫౌలా హార్డ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ వార్త పత్రిక పేజ్6 నివేదించింది.

ఈ వేడుక‌లో బిల్ గేట్స్ ఆయన ప్రియురాలు ఫౌలా హార్డ్‌లు ఇతర బంధుమిత్రులు సరదాగా ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా బిల్ గేట్స్ ఫౌలా డేటింగ్ లో ఉన్నారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్ సింగిల్ ఫైనల్ మ్యాచ్ చూడడానికి వచ్చి అక్కడ సందడి చేశారు.

ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి కనిపించడంతో ఈ విషయంపై మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించిన సరైన సమాధానం రాలేదు. దీంతో త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్క‌బోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.