చిరు భోళా శంకర్ తొలి రివ్యూ వచ్చేసింది… మూవీ ఎలా ఉందంటే..!?

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ త‌ర్వాత‌ నటిస్తున్న మరో సినిమా భోళా శంకర్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి తాజాగా సెన్సార్ కూడా పూర్తయింది ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.. పెద్దగా కట్స్ ఏమి లేకుండానే సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చేసింది.

ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ఈ మూవీతో వింటేజ్ మెగాస్టార్ ని ఆగస్టు 11న థియేటర్లో చూస్తారంటూ చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సెన్సార్ చేసిన సభ్యులు ఈ సినిమాకి తొలి రివ్యూ ఇచ్చారు. సెన్సార్ వారు నుంచి వచ్చిన రివ్యూ ప్రకారం ఈ సినిమాలో మనం వింటేజ్ మెగాస్టార్ ని చూడబోతున్నామని అదేవిధంగా మెగాస్టార్ స్టైల్ కామెడీ అదిరిపోయే యాక్షన్ దానికి తోడు ఎమోషనల్ టచ్ గూస్ బంప్స్‌ వచ్చే ఎలివేషన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయని..అదేవిధంగా ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీలో కూడా వింటేజ్‌ చిరంజీవి లుక్ తోనే చిరంజీవి హిట్ కొట్టాడు.

ఇప్పుడు మరోసారి భోళా శంకర్ లో కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతూ వింటేజ్‌ చిరంజీవి లుక్ తోనే సినిమా మొత్తం నింపేశాడు దర్శకుడు మెహర్ రమేష్. ఇప్పుడు సెన్సార్ స‌భ్యుల‌ నుంచి వచ్చిన రివ్యూ ప్రకారం ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టైలర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఖుషి చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.