టీడీపీకి మ్యాజిక్ ఫిగర్‌కు ఈ 8 జిల్లాలు చాలు…!

నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి అధికారం సొంతం చేసుకోవాలని టి‌డి‌పి కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఈ సారి వైసీపీని ఎలాగైనా గద్దె దించాలని చూస్తుంది. ఈ క్రమంలో టి‌డి‌పి పదునైన వ్యూహాలతో ముందుకెళుతుంది. పొత్తుల దిశగా కూడా వెళుతున్న విషయం తెలిసిందే. జనసేనతో టి‌డి‌పి పొత్తు ఖాయమనే చెప్పవచ్చు. పొత్తు ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో…వైసీపీకి గడ్డు పరిస్తితులు తప్పవని తెలుస్తుంది.

తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు తొల‌గించండి..! ఈసీ కి అందిన ఫిర్యాదు..!! | Ban the cycle symbol to tdp..! complained to EC..!! - Telugu Oneindia

టి‌డి‌పి-జనసేన పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా టి‌డి‌పి-జనసేన..గెలవడానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్ కేవలం 8 జిల్లాల్లోనే సాధించే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నారు. ఆ జిల్లాల్లోనే టి‌డి‌పి 88 మ్యాజిక్ ఫిగర్ దాటుతుందని, జనసేన సపోర్ట్ తో సత్తా చాటడం ఖాయమని అంటున్నారు. అలా టి‌డి‌పి మ్యాజిక్ ఫిగర్ దాటించే జిల్లాలు శ్రీకాకుళం-ప్రకాశం జిల్లాలు.

మొదట ఉత్తరాంధ్ర తీసుకుంటే..అక్కడ మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం. ఒక విశాఖలో జనసేన ప్రభావం కాస్త ఉంది. అయినా ఉత్తరాంధ్రలో టి‌డి‌పికి ఆధిక్యం ఉంది. అక్కడ 34 సీట్లు ఉన్నాయి…అందులో టి‌డి‌పి-జనసేన కలిసి 25 సీట్లు గెలుచుకోవడం ఖాయమని అంటున్నారు. ఇక తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు..ఈ జిల్లాల్లో కూడా 34 సీట్లు ఉన్నాయి.

File:Telugu Desam Party Flag.png - Wikipedia

ఇక్కడ టి‌డి‌పి-జనసేన పొత్తు ప్రభావం ఎక్కువ..రెండు పార్టీలు కలిసి..25-28 సీట్లు వరకు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇక కృష్ణ-గుంటూరు-ప్రకాశం..ఈ మూడు జిల్లాలు కలిపి 45 సీట్లు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 30 పైనే సీట్లు టి‌డి‌పి-జనసేన గెలుచుకుంటాయని అంటున్నారు. దీంతో గెలవడానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్ సీట్లు 88..ఈ జిల్లాల్లోనే వచ్చేస్తాయని లెక్కలు వేస్తున్నారు. చూడాలి మరి టి‌డి‌పి-జనసేన పొత్తు ఏ మేర సత్తా చాటుతుందో.