జగన్ ఎత్తులకు బాబు – పవన్ చెక్.. వైసీపీకి అప్పుడే కోలుకోలేని షాక్‌…!

ఒకే ఒక దెబ్బ..ఇంతకాలం టి‌డి‌పి-జనసేన పొత్తు విషయంలో అనేక ఫేక్ ప్రచారాలు చేస్తున్న వైసీపీకి చంద్రబాబు-పవన్ చెక్ పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు ఫిక్స్ చేసుకుని..వైసీపీని కోలుకొని దెబ్బ కొట్టడానికి రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి అలా జరగకూడదు అని బాబు, పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు.

Pawan Kalyan Latest Health Update: Stable in Hospital, Being Treated For  Phlegm in Lungs

అయితే టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే తమకు నష్టం తప్పదని వైసీపీ అంచనా వేసింది..అందుకే ఏదో రకంగా పొత్తు లేకుండా చేయడానికి అనేక కుట్రలు చేస్తూ వచ్చింది. టి‌డి‌పి-జనసేన శ్రేణుల మధ్య చిచ్చు పెట్టడానికి చూసింది. పవన్‌కు సి‌ఎం సీటు ఇస్తేనే టి‌డి‌పితో పొత్తు ఉంటుందని, జనసేన శ్రేణులు డిమాండ్ చేసినట్లు ప్రచారం చేసింది. అలాగే కాపు ఓట్లని పవన్..బాబుకు తాకట్టు పెడుతున్నారని, కాపు వర్గాల్లో చిచ్చు పెట్టడానికి చూసింది. ఇలా రకరకాలుగా వైసీపీ..టి‌డి‌పి-జనసేన పొత్తు చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది.

కానీ ఆ ప్రయత్నాలకు బాబు, పవన్ చెక్ పెట్టేశారు. ఇప్పటికే బాబు..పవన్‌తో కలుస్తానని, పవన్ తో కలుస్తుంటే వైసీపీకి భయం ఎందుకని ప్రశ్నించారు. ఇదే క్రమంలో పవన్ సైతం వైసీపీని గద్దె దించడానికి ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటానని, వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని, అదే సమయంలో సి‌ఎం సీటు అడగాలంటే…గత ఎన్నిక్కలో జనసేన 137 స్థానాల్లో పోటీ చేసిందని, అప్పుడు కనీసం 30-40 సీట్లలో గెలిపించి ఉంటే..ఇప్పుడు సి‌ఎం సీటు అడగొచ్చు, కానీ జరగలేదు కాబట్టి పదవి అడగలేమని అన్నారు.

Chandrababu Naidu lists out growth schemes, promises more

పదవి కోసం మనం పాకులాడకూడదు అని, పదవి మన దగ్గరకు రావాలని అన్నారు. అంటే సి‌ఎం సీటు క్లారిటీ వచ్చేసింది..టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే చంద్రబాబు సి‌ఎం..అందులో డౌట్ లేదు. కాబట్టి వైసీపీ ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసిన ఇంకా ఉపయోగం లేదు. టి‌డి‌పి-జనసేన పొత్తుతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తాగడం ఖాయం.