మూవీ మొగల్ రామానాయుడు ఇంత మంది స్టార్స్ కి లైఫ్ ఇచ్చారా..ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే మూవీ మొగల్ గా పేరు తెచ్చుకుని భారతదేశంలో ఉన్న అన్ని పరిశ్రమలో సినిమాలు చేసిన ఏకైక లెజెండ్రీ నిర్మాత డి రామానాయుడు. అయ‌న‌ చేతుల మీదగా ఎన్నో సినిమాలు ప్రేక్షకు ముందుకు వచ్చాయి. అలాగే ఎందరో నటులు, హీరోయిన్లు , దర్శకులు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అలా రామానాయుడు సినిమాలతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటినట్లు ఎవరో ఒకసారి చూద్దాం.

వెంకటేష్: రామానాయుడు చిన్న కొడుకు వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాను రామానాయుడు స్వయంగా నిర్మించాడు.హరీష్: 1990 లో వచ్చిన ప్రేమ ఖైదీ సినిమాతో సోలో హీరోగా హరీష్ ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు రామానాయుడు. మరో సీనియర్ హీరోయిన్ మాలా శ్రీ కూడా ఇదే ప్రేమఖైదీ సినిమాతోనే హీరోయిన్గా తెలుగు తేరకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఈమె స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగింది.

ఆర్యన్ రాజేష్: సీనియర్ దర్శకుడు ఇవి సత్యనారాయణ పెద్దకొడుకు ఆర్యన్ రాజేష్ ను కూడా రామానాయుడు హాయ్ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయం చేశారు. అయితే ఈ సినిమాను ఆర్యన్ రాజేష్ తండ్రి స్వయంగా తెరకెక్కించాడు. కామెడీ సినిమాలతో స్టార్ హీరోగా మారిన అల్లరి నరేష్ కూడా రామానాయుడు అల్లరి సినిమాతో హీరోగా పరిచయం చేశాడు.

టబు: మరో సీనియర్ స్టార్ హీరోయిన్ టబు ని కూడా వెంకటేష్ హీరోగా వచ్చిన కూలి నెంబర్ వన్ సినిమాతో తెలుగులో హీరోయిన్గా రామానాయుడు పరిచయం చేశారు. మరో అందాల నటి కుష్బూను కూడా వెంకటేష్ మొదటి సినిమా కలియుగ పాండవులు సినిమా తోనే హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు రామానాయుడు.ఆర్తి అగర్వాల్: దివంగత నటి ఆర్తి అగర్వాల్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాని కూడా రామనాయుడు స్వయంగా నిర్మించారు. మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్‌ను కూడా బాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత మన రామానాయుడుకే దక్కింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ప్రేమ ఖైది సినిమాను హిందీలో రీమేక్ చేయగా.. ఈ సినిమాతో కరిష్మా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో అందాల భామ అంజలా జావేరి.. వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమాతో టాలీవుడ్ లో హీరోని అడుగు పెట్టింది. ఈమెను కూడా మూవీ మొగల్ రామానాయుడుు పరిచయం చేశారు.

వాణిశ్రీ: మ‌రో సీనియార్ హీరోయిన్ వాణిశ్రీ ని కూడా రామానాయుడు నిర్మించిన సినిమాలతోనే హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. జయంత్ సి. పరాన్జీ రామానాయుడు నిర్మాణంలోనే పరిచయం అయిన దర్శకుల్లో జయంత్ సి పరాన్జీ కూడా ఒక‌రు. ప్రేమించుకుందాం రా సినిమాతో ఈయన దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత వ‌రుస సినిమాల‌తో మంచి విజయాలు అందుకున్నాడు. మ‌రో దివంగ‌త న‌టి దివ్య భారతిని కూడా వెంకటేష్ హీరోగా వచ్చిన బొబ్బిలి రాజా సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. రెండేళ్లలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది.. ఆ తర్వాత దురదృష్టవశాత్తూ ఆమె చనిపోయింది.

బి. గోపాల్‌: ప్యాక్ష‌న్ సినిమాల ద‌ర్శ‌కుడు బి. గోపాల్‌ కూడా రామానాయుడు బ్యానర్‌లోనే దర్శకుడిగా మారాడు. ఈయన తొలి సినిమా ప్రతిధ్వని సురేష్ ప్రొడక్షన్స్‌లోనే వచ్చింది. చిరు హీరోగా వ‌చ్చిన సంఘ‌ర్ష‌న సినిమాతో ద‌ర్శ‌కుడిగా మ‌రిన వై ముర‌ళి మోహ‌న్ రావును కూడా రామానాయుడు ప‌రిచ‌యం యేశాడు. మరో దర్శకుడు వై నాగేశ్వరరావు కూడా రామానాయుడు పరిచయం చేశాడు ఆయన మొదటి సినిమా బాలకృష్ణ హీరోగా వచ్చిన రాము. ఈ సినిమా కూడా మంచి విజయమే సాధించింది. ఇలా ఎందరో దర్శకులు హీరోలు నటీనటులు చిత్రపరిశ్రమ కు రామానాయుడు ద్వారా పరిచయమై ఎప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

Tags: b gopal, celebrities news, d rama naidu, harish, kushbu, latest film news, latest filmy updates, latest news, social media, Star hero, Star Heroine, Tabu, telugu news, Tollywood, Venkatesh, viral news