ఈ టాలీవుడ్ స్టార్ హీరోలకు తండ్రి ఒక్కడే… కానీ తల్లులు మాత్రం వేరే…!

చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు విడాకులు అనేవి చాలా కామన్ గా జరుగుతుంటాయి. టాలీవుడ్ లో కూడా ఎంతోమంది సినీ తారలు రెండు, మూడు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు.. అంతేకాకుండా వారి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే అలా తెలుగు ఇండస్ట్రీలో తండ్రి ఒక్కరే అయినా వేరువేరు త‌ల్లుల‌కు పుట్టిన హీరోలు చాలామంది ఉన్నారు. అలా పుట్టిన హీరోలు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం.

Jr. NTR's salute to half-brother Kalyan Ram: No one else can play Bimbisara

ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్:
ఈ నందమూరి హీరోలకు తండ్రి ఒక్కడే కానీ తల్లులు మాత్రం వేరు వేరు.. ఎన్టీఆర్- క‌ల్యాణ్ రామ్ ఇద్దరూ దివంగత నటుడు రాజకీయ నేత‌ హరికృష్ణ కుమారులు. హరికృష్ణ మొదటి భార్య లక్ష్మీ కొడుకుగా కళ్యాణ్ రామ్ జన్మిస్తే.. రెండో భార్య షాలినీ సంతానంగా ఎన్టీఆర్ జన్మించాడు. అయితే వీరికి తల్లులు వేరైనా సొంత అన్నదమ్ముల కంటే ఎంతో ఆప్యాయంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉంటున్నారు.

Manchu Vishnu - Manchu Manoj: మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు.. సీరియస్ అయిన  మంచు వారబ్బాయి.. | Disputes between Manchu Brothers Vishnu and Manoj here  the main story behind pk– News18 Telugu

మంచు విష్ణు-మంచు మనోజ్:
విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా తన జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మంచు లక్ష్మి, మంచు విష్ణు మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవికిి జన్మించినారు. వీరు జన్మించిన తర్వాత విద్యాదేవి మరణించడంతో.. ఆమె చెల్లెలు నిర్మలాదేవితో మోహన్ బాబు రెండో వివాహం చేసుకున్నాడు.. వీరికి మంచు మనోజ్ జన్మించాడు.

Naga Chaitanya, Akhil Akkineni take up the fitness challenge | Telugu Movie  News - Times of India

నాగచైతన్య-అఖిల్:
అక్కినేని హీరోలుగా నాగచైతన్య- అఖిల్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. అయితే ఈ అక్కినేని హీరోలకు కూడా తల్లులు మాత్రం వేరు వేరు.. నాగార్జున మొదటి భార్య లక్ష్మీకి నాగచైతన్య జన్మిస్తే.. రెండో భార్య అమలకు అఖిల్ జన్మించాడు.. అలా ఈ ఇద్దరు అన్నదమ్ములు తల్లులు వేరైనా సొంత వారిలా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.

Mahesh Babu's Brother Naresh's Wife Catches Him Red Handed With Fiancée  Pavithra Lokesh In A Hotel Room, Beats Him With Slippers – Watch

మహేష్ బాబు-నరేష్:
సూపర్ స్టార్ కృష్ణ నట వారసులుగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన మహేశ్- నరేష్ ఈ అన్నదమ్ములు ఇద్దరికీ త‌ల్లులే కాదు తండ్రులు కూడా వేరు వేరు.. సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య‌కు మహేష్ జన్మించాడు కృష్ణ రెండో భార్య విజయనిర్మల తన మొదటి భర్త ద్వారా ఓ కుమారుడికి జన్మనిచ్చింది. అతడే నరేష్.. ఇక కృష్ణ- విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నాక నరేష్ ని కూడా తన సొంత కొడుకులా చూసుకున్నాడు. ఇక వేరే కాకుండా చిత్ర పరిశ్రమలోకి ఎంతోమంది ఉన్నారు.