టాలీవుడ్‌లో హ‌య్య‌స్ట్ సెంట‌ర్స్‌లో 100 – 175 రోజులు ఆడిన టాప్‌-10 సినిమాలు ఇవే..!

ఇది వరకు టాలీవుడ్ లో సినిమాల హిట్స్ ని ఎన్ని సెంటర్స్ లో ఆడాయి లాంటి వివరాలతో ఏ రేంజ్ హిట్ అనేది చెప్పే వాళ్ళు, కానీ కాలం మారుతున్న కొద్ది సినిమాల బాక్స్ ఆఫీస్ రన్ కూడా తగ్గుకుంటూ రాగా, ఒకప్పటికీలా ఎక్కువ రోజులు ఆడిన సినిమాలు తగ్గిపోతూ వచ్చి కేవలం కొన్ని వారాలకే పరమితం కావాల్సి వస్తుంది. తెలుగు సినిమా హిస్టరీలో చాలా సినిమాలు 100 రోజుల వేడుకను 175 రోజుల వేడుకని కొన్ని సినిమాలు ఏకంగా 365 రోజుల వేడుకను జరుపుకున్నాయి.

వీటిలో 175 రోజుల సిల్వర్ జూబ్లీ వేడుక మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. అప్పట్లో ఒక స్టార్ క్రేజ్‌ను ఇన్ని సిల్వర్ జూబ్లీ సినిమాలు ఉన్నాయో లెక్కపెట్టి చెప్పేవారు. మరి అలాంటి ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సిల్వర్ జూబ్లీ సినిమాలలో..ఎక్కువ సెంటర్లలో జరుపుకున్న సినిమాల విషయానికి వస్తే కొన్ని సినిమాలు డైరెక్ట్ గానే కొన్ని థియేటర్స్ లో ఈ రికార్డులను నమోదు చేశాయి, కొన్ని సినిమాల ఇతర థియేటర్స్ లో షిఫ్ట్ ల పద్దతి లో కూడా ఈ రికార్డ్ ను అందుకున్నాయి.అలా థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన టాప్ 10 సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Pelli Sandadi Movie Download Telugu 2021 in High Definition [HD]

సింహాద్రి:
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా సింహాద్రి. ఈ సినిమా 2003లో విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఆ రోజుల్లో 175 సెంటర్లో వంద రోజులకు పైగా ఆడి… 52 సెంటర్లో 175 రోజులను పూర్తి చేసుకుని.. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

పోకిరి:
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా పోకిరి.. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే ఆల్ టైం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 200 సెంటర్లో 100 రోజులు ఆడింది.. 48 సెంటర్లో 175 రోజులకు పైగా ఆడి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

Watch Nuvve Kavali movie - Starring Tarun as Lead Role on ETV Win |  Download ETV Win on Play Store

ఇంద్ర:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బి. గోపాల్ డైరెక్షన్‌లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా ఇంద్ర.. ఈ సినిమా 2002లో విడుదలై చిరంజీవికి అదిరిపోయే హిట్ ఇచ్చింది.. ఈ సినిమా ఆ రోజుల్లో ఏకంగా 122 సెంటర్లో 100 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా… 31 కేంద్రాల్లో 175 రోజులకు పైగా ఆడి.. చిరంజీవి కెరీర్ లోనే ఆల్ టైం హిట్‌గా నిలిచింది.

సమరసింహారెడ్డి:
నందమూరి బాలకృష్ణ హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ సినిమా సమరసింహారెడ్డి… ఈ సినిమా 1999లోవిడుదలై బాలకృష్ణకు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా ఏకంగా ఆ టైంలో 29 కేంద్రాల్లో 175 రోజులకు పైగా ఆడింది.

Premabhishekam Full Length Telugu Movie - YouTube

పెళ్లి సందడి:
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన సినిమా పెళ్లి సందడి.. ఎలాంటి అంచనాలు లేకుండా 1996లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ ఈ సినిమా శ్రీకాంత్ కు ఆల్ టైం హిట్ సినిమాగా నిలిచింది.. ఈ సినిమా ఆ రోజుల్లో ఏకంగా 27 థియేటర్లలో 175 రోజులకు పైగా ఆడింది.

నువ్వే కావాలి:
తరుణ్ హీరోగా విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా నువ్వే కావాలి.. ఈ సినిమా 2000వ‌ సంవత్సరంలో విడుదలై తరుణ్‌కు అదిరిపోయే హిట్ ఇచ్చింది.. ఈ సినిమా ఆ టైంలోనే 20 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా 25 సెంటర్లో 175 రోజులుకు పైగా ఆడి ఆల్ టైం రికార్డ్‌ను క్రియెట్ చేసింది.

NBK - B.Gopal's Industry Hit Narasimha Naidu completes 20 years.

ప్రేమాభిషేకం:
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా ప్రేమాభిషేకం.. 1981లో విడుదలైన ఈ సినిమా ఆ రోజుల్లోనే 19 కేంద్రాల్లో రజితోత్సవం జరుపుకుంది.

నరసింహనాయుడు:
బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన మరో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడు.. 2001లో విడుదలైన ఈ సినిమా 17 థియేటర్లలో 175 రోజులకు పైగా ఆడి బాలకృష్ణకు మరో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

Kalisundam Raa Telugu Movie Streaming Online Watch

 

కలిసుందాం రా:
విక్టరీ వెంకటేష్ హీరోగా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా కలిసుందాం రా…2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోనే అదిరిపోయే హిట్ సినిమాగా నిలిచింది.. ఈ సినిమా 14 సెంటర్ల 175 రోజులు ఆడింది.

లవకుశ:
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సినిమా లవకుశ.. 1963 లో మొదటి కలర్ సినిమాగా వచ్చిన లవకుశ ఆ రోజుల్లోనే కోటి రూపాయలకు పైగా కలెక్షన్లను రాబట్టింది.. 13 సెంటర్లో 175 రోజులకు పైగా ఆడ‌గా ఈ సినిమాతో ఎన్టీఆర్ రికార్డులను ఎన్టీఆర్ తిరగరాసుకున్నాడు.

Lava Kusa Telugu Movie Streaming Online Watch on MX Player, Sun NXT

Tags: filmy updates, hit movies, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news