హీరోయిన్లను మించి రమ్యునరేషన్లతో కోట్లు కూడా పెడుతున్న టాలీవుడ్ యాంకర్లు వీళ్లే..!

ఒకప్పుడు బుల్లితెర, వెండితెర మధ్యలో ఓ సన్నని గీత ఉండేది. కానీ నేది పరిస్థితి మారింది. బడా హీరోలు, హీరోయిన్లు సైతం బుల్లితెరపైన వ్యాఖ్యాతగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాకుండా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా బుల్లితెర యాంకర్లు కొందరు పారితోషకం తీసుకోవడం హాట్ టాపిక్ గా మరింది. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటూ రకరకాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే సదరు యాంకర్లు భారీ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంటున్నారు. అందులో మొదటగా చెప్పుకోదగ్గ “యాంకర్ సుమ” కనకాల. దాదాపుగా గత 2 దశాబ్దాలుగా స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తున్న ఈమె అడపాదడపై సినిమాలలో కూడా నటించడం విశేషం. ఈమె పలుషోలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ముఖ్యంగా సినిమా ఆడియో ఫంక్షన్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ భారీగా వెనకేసుకుంటుంది.

Telugu TV Anchors Remuneration List: Here's How Much Suma Kanakala,  Anasuya, Sreemukhi & Others Are Charging - Filmibeat

 

ఈ క్రమంలోని ఒక్కో ఈవెంట్ కి రూ.4 లక్షల మేర పారితోషకం తీసుకుంటోందని సమాచారం. ఆ తరువాత “అనసూయ” గురించి ఇక్కడ ప్రస్తావించాలి. గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బుల్లితెర షోలలో యాంకర్ గా వ్యవహరించడానికి ఈవెంట్ కి రూ. 3 లక్షల చొప్పున పారితోషకం తీసుకుంటుందని సమాచారం.

ఆ తరువాత బాగా వినబడుతున్న పేరు “రష్మీ గౌతమ్.” రష్మీ గౌతమ్ గత 10 సంవత్సరాలుగా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి విదితమే. ఈమె ప్రస్తుతం ఈమె ఒక్కో ఎపిసోడ్ కి గాను సుమారుగా రూ.2 లక్షల మేర పారితోషకం తీసుకుంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక చివరగా చెప్పుకోబోయే పేరు “శ్రీముఖి.” బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న శ్రీముఖి ఒక్కో ఈవెంట్ కు సుమారుగా రూ.2 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు భోగట్టా..!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, top anchors, trendy news, viral news