ఇండియా బ‌య‌ట కూడా క‌లెక్ష‌న్ల‌లో కుమ్మేసిన మ‌న సినిమాలు ఇవే…!

ఒకప్పుడు తెలుగు భాష అంటే ఒకటుందని కూడా విదేశీయులకి తెలిసేది కాదు. అంతదాకా ఎందుకు? ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే నానుడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారతీయ సినిమా అంటే టాలీవుడ్ సినిమానే అన్న రీతిగా మన సినిమాలు అక్కడ దుమ్ముదులుపుతున్నాయి. అంతేకాకుండా కన్నడ, తమిళ సినిమాలు కూడా తమ ఉనికిని చాటిచెబుతున్నాయి.

 

ప్రస్తుతం విదేశాల్లో తెలుగు సినిమాల కలెక్షన్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వక మానదు. ఇదివరకు అమెరికాలో మన తెలుగు సినిమాలకి ఉన్న మార్కెట్ తో 1 మిలియన్ డాలర్ కాలేషన్స్ మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు ఇది 2 , 3 మిలియన్ డాలర్స్ వరకు కలెక్షన్స్ వసూళ్లు చేసి అవాక్కయేలా చేస్తున్నాయి. అమెరికానే కాకుండా జపాన్, సింగపూర్, దుబాయ్, మలేషియా లాంటి దేశాల్లో మన తెలుగు సినిమాలకి ఇపుడు మంచి మార్కెట్ వుంది.

ఈ క్రెడిట్ అంతా దర్శకుడు రాజమౌళి మహిమనే చెప్పుకోక తప్పదు. ఈ క్రమంలో మన ఇండియాలో కాకుండా విదేశాల్లో ఎక్కువ మొత్తంలో కలెక్షన్స్ రాబట్టిన సౌత్ సినిమాల గురించి చూద్దాము.
ఈ లిస్టులో ముందుగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి2 సినిమా గురించి చెప్పుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.1810 కోట్లు వసూలు చేసి భారతీయ సినిమా సత్తా ఏమిటో చాటింది. ఆ తరువాత కన్నడ నుండి వచ్చిన కేజీఎఫ్ ఈ రికార్డ్స్‌ను బ్రేక్ చేసింది అని చెప్పుకోవాలి.

ఇక ఆ తరువాత మళ్ళీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా మరలా రికార్డులు మోత మోగించింది. ఎంతగా అంటే ఆ రీసౌండ్ ఇంకా వినబడుతోంది. ఈ సినిమా కలెక్షన్లు మాత్రమే కాకుండా ఏకంగా ఇంటర్నేషనల్ అవార్డులు కూడా తెచ్చిపెడుతోంది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, trendy news, viral news