ఆ మోజుతోనే విజ‌య‌నిర్మల మొద‌టి భ‌ర్తను వ‌దిలేసిందా…!

లెజెండ్రీ నటి, ద‌ర్శ‌కురాలు, నిర్మాత‌, సూప‌ర్ స్టార్ కృష్ణ స‌తీమ‌ణి విజ‌య‌నిర్మ‌ల గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేవలం ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం `మత్స్యరేఖతో` సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. వ‌చ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని అన‌తి కాలంలోనే అగ్ర హీరోయిన్ గా ముద్ర వేయించుకున్నారు.

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 200 వంద‌ల‌కు పైగా చిత్రాల్లో విజ‌య‌నిర్మ‌ల న‌టించారు. అలాగే మ‌రోవైపు ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గానూ స‌త్తా చాటారు. 1972లో ‘కవిత’ అనే మలయాళ సినిమాను విజ‌య్ నిర్మాల తొలిసారి దర్శకత్వం వహించింది. ఆ తర్వాత ఏడాది తెలుగులో ‘మీనా’ సినిమాను తెరకెక్కించింది. ఇక్క‌డ మొద‌టి సినిమాతోనే తిరుగులేని విజయాన్ని సాధించి దర్శకురాలిగా తన ప్రతిభను అంద‌రికీ చాటి చెప్పింది.

దర్శకత్వం మీదున్న మక్కుతో ఏకంగా 44సినిమాలకు దర్శకురాలిగా పనిచేసింది. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో తన పేరు లిఖించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే విజ‌య‌నిర్మ‌ల కృష్ణ‌ను ప్రేమ వివాహం చేసుకుంది. కృష్ణ‌కు విజ‌య‌నిర్మ‌ల రెండో భార్య అన్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. కానీ, ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. విజ‌య్‌నిర్మ‌ల‌కు కూడా కృష్ణ రెండో భార్తే.

Family Hid Vijaya Nirmala's Death News! | cinejosh.com

విజ‌యనిర్మ‌ల మొద‌టి భ‌ర్త ఎవ‌రు..? అస‌లు అత‌నితో ఎందుకు విడిపోయింది..? అన్న విష‌యాలు చాలా మందికి తెలియ‌దు. విజ‌యనిర్మ‌ల మొద‌ట‌ కృష్ణ‌మూర్తి అనే ఆయ‌న్ను పెళ్ళి చేసుకుంది. కృష్ణ‌మూర్తి షిప్ డిజైనింగ్ ఇంజ‌నీర్ గా ప‌ని చేశారు. ఈ దంప‌తుల‌కు ఒక కొడుకు కూడా జ‌న్మించారు ఆ కొడుకు మ‌రెవ‌రో కాదు వి.కె. న‌రేష్‌.

 

వివాహం త‌ర్వాత కొద్ది సంవ‌త్స‌రాలు విజ‌య‌నిర్మ‌ల‌, కృష్ణ‌మూర్తి సంసారం స‌జావుగానే సాగింది. కానీ, సిన‌మాల మీద ఉన్న మోజుతో విజ‌య‌నిర్మ‌ల కృష్ణ‌మూర్తికి దూర‌మైంది. హీరోయిన్‌గా న‌టించాల‌నే కోరిక ఉండ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు మొద‌ల‌య్యాయి. ఆ విభేదాలు తారా స్థాయికి చేర‌డంతో త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత విజ‌య‌నిర్మ‌ల స‌హ‌న‌టుడు కృష్ణ‌ను పెళ్లాడింది.

Tags: film news, filmy updates, Heroines, intresting news, latest news, latest viral news, social media, social media post, Star hero, Star Heroine, Star Heroines, telugu news, Tollywood, trendy news, viral news