టాలీవుడ్ టాప్ – 5 ధనవంతుల్లో ఎన్టీఆర్ … ఎన్ని కోట్ల ఆస్తి అంటే..?

సీనియర్ ఎన్టీఆర్ కు వారసులుగా వచ్చిన హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తాత ఎన్టీఆర్, బాబాయ్ బాలకృష్ణ తర్వాత నందమూరి ఫ్యామిలీలో అంతటి స్టార్ డంను సంపాదించింది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అయ‌న 29 సినిమాలు చేస్తే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తాతకు తగ్గ మనవడిగా టాలీవుడ్ లో తన నటనకు పేరు తెచుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్.. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి యమదొంగ‌, సింహాద్రి, బాద్ షా, టెంపర్, జై లవకుశ, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, ఆర్ ఆర్ ఆర్ ఇలా ఎన్నో సినిమాలలో నటించి హిట్స్ కొట్టాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్టీఆర్ చాలా ఆస్తులు కూడ‌బెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు పారితోషకాన్ని మ‌రీ ఎక్కువ తీసుకోడు.. మార్కెట్‌కు కాస్త అటూ ఇటూగా తీసుకుంటాడు.

Jr NTR: Arranged marriage at 18, mother of two.. Who is Jr NTR's wife  Lakshmi? – rrr

 

గత పది సంవత్సరాల నుంచి ఆస్తులను కూడా బాగానే సంపాదించాడు. ఎన్టీఆర్ గ‌తంలో ఒక్కో సినిమాకు రూ. 20 కోట్లకు పైగా వసూలు చేస్తారని.. పాన్‌ ఇండియా సినిమాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాకు రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడ‌ని టాక్ ? ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న సినిమాకు కూడా రు. 40 కోట్ల‌తో పాటు లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం కుదిరింది.

 

ఇక ఎన్టీఆర్ ఒక్కో యాడ్‌కు రూ. 20 కోట్ల వరకు తీసుకుంటారట‌. అప్పట్లో ఎన్టీఆర్ బిగ్ బాస్ వంటి పెద్ద రియాలిటీ షోలో కూడా హోస్ట్ గా చేశాడు. ఇక తండ్రి ఇచ్చిన ఆస్తులు స్వ‌ల్ప‌మే అయినా ఇప్ప‌టి మార్కెట్ ప్ర‌కారం వాటి రేట్లు పెరిగాయి. తన భార్య లక్ష్మీ ప్రణ‌తీ పేరు మీద‌ కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయని… ఇవన్నీ కలిసి ఎన్టీఆర్ ఆస్తుల విలువ రు. 2 వేల‌ కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ట‌.

Tags: film news, filmy updates, intresting news, jr ntr, latest news, latest viral news, Nandamuri Family, social media, social media post, Star hero, Star Heroine, telugu news, telugu viral news, Tollywood, trendy news