సైడ్ బిజినెస్‌ల‌తోనూ కోట్లు సంపాదిస్తోన్న స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

ఇండస్ట్రీలో హీరోయిన్స్ లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. అయితే చాలామంది స్టార్ హీరోయిన్స్ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే సైడ్ బిజినెస్ లు పెట్టి వాటిలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. అలా ఇప్పటికే చాలామంది బిజినెస్ లు పెట్టి వాటిలో సక్సెస్ అయ్యారు. లట్ కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన హీరోయిన్స్ ఎవరో వారి బిజినెస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Shocking! Keerthy Suresh Rejected Two Blockbuster Films Just To Work With  This Superstar, Take A Look | IWMBuzz

కీర్తి సురేష్ :
మహానటి సినిమా ద్వారా కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్న కీర్తి సురేష్.. అతి తక్కువ సమయంలోనే స్టార్డంని సొంతం చేసుకుంది. ఇటీవల దసరా సినిమాలో వెన్నెల పాత్రలో తెలంగాణ యాసతో మెప్పించిన కీర్తి సినిమాల్లోనే కాక బిజినెస్ లోను సక్సెస్ఫుల్గా రాణిస్తుంది. కీర్తి భూమిత్ర పేరుతో కెమికల్ ఫ్రీ స్క్రీన్ కేర్ బ్రాండ్ ను ప్రారంభించి మంచి సక్సెస్ సాధించింది.

Kajal Agarwal requests people to back small business after lockdown | Tamil  Movie News - Times of India

కాజల్ అగర్వాల్ :
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ కొంత కాలం క్రితం గౌత‌మ్ కిచులుని వివాహం చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే వివాహం చేసుకొని బాబు పుట్టడంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కాజల్ ఇటీవల సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తో కొనసాగుతుంది. అయితే కాజల్ కూడా తన చెల్లి నిషా అగర్వాల్ తో కలిసి ఫ్యాషన్ జ్యువెలరీ బిజినెస్ ని రన్ చేస్తుంది.

Ileana D'Cruz Age, Height, Age, Family, Biography & More

ఇలియానా :
గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక మెరుపు మెరిసింది. కందిరీగ లాంటి నడుముతో కోట్లాదిమంది కుర్ర కారును కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కి కొంతకాలంగా దూరమై బాలీవుడ్ లో సెటిలైంది. అయితే ఇలియానా గోవాలో రెస్టారెంట్, బ్యాక‌రీలు రన్ చేస్తూ సూపర్ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న విషయం చాలామందికి తెలుసు.

Rakul Preet Singh oozes charm in red dress; see photos - Articles

రకుల్ ప్రీత్ సింగ్ :
ఒకప్పుడు టాలివుడ్ స్టార్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ అగ్ర హీరోల అందరి సరసన నటించింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ వరుస‌ సినిమాలు చేస్తు బిజీగా ఉంటుంది. ఇక రకుల్ ప్రీత్ కి ఫిట్నెస్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఆమె F45 అనే పేరుతో హైదరాబాదులో చాలాచోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేసి జిమ్ సెంటర్స్ ను రన్ చేస్తుంది.

Tamannaah Bhatia To Tie The Knot With Mumbai-Based Businessman, Here's What  We Know

తమన్న :
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వచ్చి దగ్గర దగ్గరగా 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవల తమన్నా వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యువెల‌రి బిజినెస్ ను మొదలు పెట్టింది.

Shruti Hassan: 'It was very obvious I got my nose fixed' | Bollywood -  Hindustan Times

శృతిహాసన్ :
కమల్ హాసన్ నటవరసరాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ తండ్రికి తగ్గ కూతురుగా మంచి పేరు సంపాదించుకుంది. అగ్రహీరోలంద‌రి సరసన నటించిన శృతి సొంతంగా ప్రొడక్షన్ హౌస్, యానిమేషన్ ఫిలిం, వీడియో రికార్డింగ్ సంస్థలను స్థాపించి ఆమె బిజినెస్‌ల్లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది.

Samantha Ruth Prabhu is Looking For a Suitable Match But There's a Catch

సమంత :
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత.. నాగచైతన్యతో విడాకుల తర్వాత సినిమాల పరంగా కాస్త డల్ అయ్యింది. విడాకులు తర్వాత హీరోయిన్ గా నటించిన యశోద, శాకుంతలం సినిమాలు ప్లాప్‌ కావ‌డంతో ఆమె క్రేజ్ కాస్త తగ్గింది. సమంత కూడా ఇటీవల సాకీ అనే పేరుతో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించింది.