బాల‌య్య – ర‌జ‌నీకాంత్ – శివ‌రాజ్‌కుమార్ భారీ మ‌ల్టీస్టార‌ర్ డైరెక్ట‌ర్ ఫిక్స్‌…!

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్‌గా ఉన్న‌ అంశాల్లో నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ సినిమా ఒకటి. నటసింహం ఇప్పుడు ఏకంగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ సినిమా చేస్తున్న‌ట్టు హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రకటించాడు. అప్పటినుంచి ఈ వార్త ఎంతో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ భారీ సినిమా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తార‌ట‌. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని మరికొందరు అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్యతో పాటు శివ రాజ్ కుమార్ అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కలిసి నటించబోతున్నారు. మూడు ఇండ‌స్ట్రీల‌కు చెందిన ఈ ముగ్గురు హీరోలు గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఎంతో మంచి స్నేహితులు. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎంతో సంచలనంగా మారింది.

సౌత్ ఇండియాలోని ముగ్గురు స్టార్ హీరోలు కలిసి చేయబోతున్న ఈ భారీ మల్టీ స్టార‌ర్ తెరకెక్కించే డైరెక్టర్ ఎవరా ? అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ భారీ మల్టీస్టారర్ ను కన్నడ స్టార్‌ దర్శకుడు హర్ష తెరకెక్కించునున్నారట. కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి ఆ తర్వాత దర్శకుడిగా మారిన హర్ష.. కన్నడంలో చాలా హిట్ సినిమాలు తెరకెక్కించాడు.

Hero Shivaraj Kumar Speech @ VEDHA Pre Release Event | Nandamuri  Balakrishna | Filmyfocus.com - YouTube

ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో వరుస శివరాజ్‌కుమార్ హీరోగా ‘భజరంగీ 2’ ‘వేద’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను చేశాడు. బాలకృష్ణ, రజనీకాంత్, శివ రాజ్ కుమార్ హీరోలుగా నటించనున్న సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం హర్ష అందుకున్నారట. ఇక ప్ర‌స్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాలకు వస్తే… అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ డిఫరెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయదశమి కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

NBK 108 తర్వాత రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారట. రామ్ హీరోగా చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమా స్క్రిప్ట్ మీద బోయపాటి శ్రీను కాన్సంట్రేషన్ చేయనున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్’ చేస్తున్నారు. ఆ సినిమాలో శివ రాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఆ షూటింగ్ చేసేటప్పుడు మల్టీస్టారర్ ప్రతిపాదన ముందుంచగా… రజనీకాంత్ ఓకే అన్నారట. ముగ్గురు హీరోల కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యాక మల్టీస్టారర్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.

Rajini, Balayya & Prabhas: Similar Themes? | cinejosh.com