ఎన్టీఆర్ ‘ దేవ‌ర ‘ సినిమా వ‌దులుకున్న టాలీవుడ్ స్టార్ హీరో… కార‌ణం ఇదే…!

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ చిరంజీవి – రామ్ చరణ్‌తో కలిసి చేసిన ఆచార్యతో భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ డిజాస్టర్ తర్వాత ఈసారి కొడితే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ మొత్తం చెదిరిపోవాలన్న‌ కసితో కొరటాల శివ… ఎన్టీఆర్ 30వ సినిమా దేవర‌ చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఏప్రిల్ మొదటి భాగంలో ప్రారంభం కాగా ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని మూడో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతుంది.

NTR 30 Devara FL: NTR In Blood Curdling Look

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ కూడా విడుదల చేయగా దానికి అభిమానుల‌ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంట‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అందులో ఒక పాత్ర పేరు దేవర కాగా.. మరో పాత్ర పేరు ఇంకా బయటికి రాలేదు.

Allu Arjun rocks it in style in Zomato Ad - Tamil News - IndiaGlitz.com

కొరటాల శివ ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న ఈ సినిమాను ముందుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో తీయాలని భావించారట. ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అల్లు అర్జున్ కొర‌టాల‌ సినిమాపై అధికారికంగా పోస్టర్ కూడా బయటికి వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌కు ఏమైందో తెలియదు కానీ ఈ సినిమాని క్యాన్సిల్ చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి కథ చెప్పగా వెంట‌నే ఒకే చేశాడు.

On Koratala Siva's birthday, a streaming guide to his movies |  Entertainment News,The Indian Express

ఆచార్య సినిమా విడుదలైన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని భావించారు. కానీ ఆచార్య సినిమా దెబ్బ పడేసరికి కొరటాల- ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ మీద మరోసారి రీ వర్క్ చేశాడు. రీజనల్ సినిమాగా రావాల్సిన ఈ సినిమాని పాన్ ఇండియా సబ్జెక్టుగా మార్చారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్, కొరటాల ఎలాంటి రికార్డులు అందుకుంటారో తెలియాలంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే.