చిరంజీవి కెరీర్‌లో డిజాస్ట‌ర్‌ సినిమాలు ఇవే… దారుణంగా దెబ్బ‌కొట్టాయ్‌…!

 

మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. వయో భారం పెరుగుతున్న సమయంలో చిరుకి మళ్లీ సక్సెస్ వస్తుందా అని ఎంతోమంది అనుమానాల మధ్య వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా 100 కోట్ల కలెక్షన్లు సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇదే ఉత్సాహంతో చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోయారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించాడు చిరు. అయితే ఈ సినిమా మాత్రం భారీ ఎక్స్పెక్టేషన్ల మధ్య రావడంతో కొంత దెబ్బ కొట్టింది.

అన్నీ రోజులు కష్టపడ్డా మెగాస్టార్ కి నిరాశ కల్గిల్చిన మూవీ....

ఈ సినిమా వల్ల దాదాపు 30 కోట్ల మేర నిర్మాతకు నష్టం వచ్చింది. ఇక అదే టైంలో కొరటాల శివతో తన తర్వాత మూవీ ని చిరంజీవితో ప్లాన్ చేశారు. ఇందులో అన్యోన్యంగా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్య సినిమాలో కనిపించారు.సైరా సినిమాతో వచ్చిన నష్టాన్ని ఆచార్య సినిమాతో తీర్చాలని అందరూ అనుకున్నారు. ఎంతో భారీ ప్రణాళికలతో తెరకెక్కించిన ఈ సినిమామా కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Mrugaraju Scene - Chiranjeevi Disaoppinted For Adavipalle Peoples -  Chiranjeevi,Simran (HD) - YouTube

అపజయం లేని కొరటాల శివ దర్శకత్వంలో మొదటిసారిగా ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట కొట్టుకున్నాడు. ఆచార్య సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. ప్రధానంగా ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించడంతో ఈ సినిమా ప్లాప్ అవడం వల్ల చిరంజీవికి మరింత అవమానం గా మారింది. అయితే ఇప్పటివరకు చిరంజీవి తన సినీ కెరీర్‌లో ఎన్ని సినిమాలు డిజాస్టర్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం.

Anji Box Office Collection | India | Day Wise | Box Office - Bollywood  Hungama

 

అంజి: టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ శ్యామ్‌ ప్రసాద్ రెడ్డి నిర్మాణ సారధ్యంలో సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా అంజి. భారీ అంచనాలతో విజువల్ వండర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది.

మృగరాజు: హాలీవుడ్ సినిమాకు రీమేక్ గా చిరంజీవి హీరోగా వచ్చిన మృగరాజు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జంటగా సిమ్రాన్ హీరోయిన్‌గా నటించింది.

శంకర్ దాదా జిందాబాద్: చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్ కు సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్.. ఈ సినిమాను బాలీవుడ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కించగా ఈ సినిమా ప్రేక్షకులను ఏం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది.

Big Boss|Chiranjeevi, Roja, Madhavi,Brahmanandam|#Action Movie| Latest  Telugu HD Movie 2016 - video Dailymotion

బిగ్ బాస్ : ఈ సినిమా పేరులో ఉన్న గొప్పతనం సినిమాలో లేకపోవడంతో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ సినిమాలే కాకుండా ఆరాధన, త్రినేత్రుడు, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, ఎస్పీ పరశురాం, జేబుదొంగ, కిరాతకుడు, చాణక్య శపథం, వేట, ధైర్యవంతుడు వంటి సినిమాలు కూడా మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే భారీ డిజాస్టర్లు గా మిగిలిపోయాయి.