మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోని స్టార్ హీరోల లిస్టులో ఒకరుగా ఉన్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలతో మెగాస్టార్ ఈ స్థాయికి ఎదిగాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా తన కష్టంతో పాపులారిటీని సంపాదించుకున్నాడు. తన కెరీర్లో 150కి పైగా చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. చిరు కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ ఉన్నప్పటికీ కొన్ని చిత్రాలు మాత్రం మధ్యలోనే ఆగిపోయాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిరంజీవి హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో భూలోక దొంగ చిత్రాన్ని మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా కథలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని గుర్తించి మధ్యలోనే డ్రాప్ అయ్యాడు చిరు. చిరు హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో అబూ బాగ్దాద్, గజదొంగ అనే చిత్రాలను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఇండియాలోను పలు భాషలతో పాటు ఇంగ్లీషులోనూ విడుదల చేయాలనుకున్నారు. ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కు బడ్జెట్ ఎక్కువవుతుంది అనే కారణంతో మధ్యలోనే ఆగిపోయింది.
చిరంజీవి హీరోగా రామ్ రెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా పూజ కార్యక్రమం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా కూడా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది.
చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తరువాత 150వ చిత్రంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ అనే సినిమాను అనౌన్స్ చేశారు.
కానీ ఈ సినిమా కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో చిరు ఖైదీ నెంబర్ 150 తో రియంట్రి ఇచ్చాడు. టాలీవుడ్ లో ఫిల్ గుడ్ లవ్ స్టోరీలు తీసిన డైరెక్టర్ ఆదిత్యతో చిరంజీవి ఓ సినిమా చేయాలనుకున్నాడు. కానీ ఏం జరిగిందో ఏంటో కానీ ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఆర్జీవి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా టబూ, ఊర్మిళ హీరోయినఃటుగా వినాలని ఉంది అనే టైటిల్ తో సినిమాను చేశారు. కానీ ఈ చిత్రం కూడా మధ్యలోనే ఆగిపోయింది.